Gautam Adani: గౌతం అదానీపై లంచం నేరాభియోగాలు లేవు: అదానీ గ్రూపు ప్రకటన
Gautam Adani: అమెరికాలోని ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్టును గౌతం అదానీ ఉల్లంఘించలేదని ఇవాళ అదానీ గ్రూపు ప్రకటన జారీ చేసింది. సోలార్ పవర్ కాంట్రాక్టును దక్కించుకునేందుకు అదానీ సంస్థ సుమారు రెండు వేల కోట్లు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు ఇవాళ ఓ ప్రకటన జారీ చేసింది. అదానీ గ్రూపు చైర్మెన్ గౌతం అదానీ(Gautam Adani), ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జక్యూటివ్ వినీత్ జైన్‌పై అమెరికాలో ఎటువంటి లంచం నేరారోపణలు లేవని ఆ గ్రూపు తన ప్రకటనలో స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని అదానీ గ్రీన్ సంస్థ పేర్కొన్నది. తాజాగా ఇచ్చిన స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని ఆ సంస్థ వెల్లడించింది.
అమెరికాలోని ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్టును గౌతం అదానీ ఉల్లంఘించినట్లు వచ్చిన ఆరోపణలు నిజం కాదు అని అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ తెలిపింది. అదానీ గ్రూపు డైరెక్టర్లపై మూడు నేరాభియోగాలు ఉన్నాయని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. అదానీ గ్రూపు సభ్యులపై అమెరికా న్యాయశాఖ మొత్తం అయిదు ఆరోపణలు చేసిందని, కానీ దాంట్లో మొదటి, అయిదవ నేరాభియోగాల్లో గౌతం అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్ లేరని సంస్థ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

