Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Gang Rape Survivor's Father Killed | కుమార్తెపై సామూహిక అత్యాచారం కేసును ఉపసంహరించుకునేందుకు బాధితురాలి తండ్రి నిరాకరించాడు. ఈ నేపథ్యంలో నిందితులు అతడ్ని హత్య చేశారు. మృతదేహాన్ని ఉరికి వేలాడదీసి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించారు.
జైపూర్: కుమార్తెపై సామూహిక అత్యాచారం కేసును ఉపసంహరించుకునేందుకు బాధితురాలి తండ్రి నిరాకరించాడు. ఈ నేపథ్యంలో నిందితులు అతడ్ని హత్య చేశారు. మృతదేహాన్ని ఉరికి వేలాడదీసి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించారు. (Gang Rape Survivor’s Father Killed) దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులపై హత్య కేసు కూడా నమోదు చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్‌లో ఒక యువతిని ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడు. మరో ముగ్గురు సహచరులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
కాగా, రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నలుగురు వ్యక్తులపై సామూహిక అత్యాచార కేసు నమోదు చేశారు. దర్యాప్తు తర్వాత ఆ నిందితులను అరెస్ట్ చేశారు.
మరోవైపు కేసు నమోదైనప్పటి నుంచి బాధితురాలి కుటుంబాన్ని నిందితులు బెదిరించారు. అత్యాచారం కేసును ఉపసంహరించుకోకపోతే బాధితురాలి తండ్రిని చంపేస్తామని వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జూలై 5న బాధితురాలి తండ్రి అయిన 58 ఏళ్ల వ్యక్తి మృతదేహం వారి ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో ఉరి వేసుకున్న స్థితిలో వేలాడుతూ కనిపించింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తొలుత ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు.
అయితే అత్యాచారం కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించిన నిందితులే బాధితురాలి తండ్రిని హత్య చేసినట్లు అతడి కుటుంబం ఆరోపించింది. ఆ వ్యక్తిని చంపిన తర్వాత ఆత్మహత్యగా నమ్మించేందుకు మృతదేహాన్ని ఉరికి వేలాడదీశారని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఆరోపణపై పోలీసులు దర్యాప్తు చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్, ఇతర ఆధారాల మేరకు తాజాగా ఆ నిందితులపై హత్య కేసు కూడా నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

