ఐఎన్ఎస్ విక్రాంత్ నాలుగో దశ ట్రయల్స్ సక్సెస్
హైదరాబాద్ : స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నాలుగో దశ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది. ఆన్‌బోర్డ్ ఏవియేషన్ సౌకర్యంతో సహా అన్ని రకాల పరికరాలు, వివిధ పరిస్థితులు.. సవాళ్లకు అనుగుణంగా పరీక్షించినట్లు నేవీ ఆదివారం తెలిపింది. నౌకను నెలాఖరులోగా డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది ఆగస్ట్‌లో ప్రారంభించనున్నట్లు పేర్కొంది. భారత నౌకాదళం, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ నౌకను నిర్మించాయి. షిప్‌యార్డులో 2వేల మంది ఉద్యోగులతో పాటు వివిధ కంపెనీలకు చెందిన 12వేల మంది నిపుణులు నౌక నిర్మాణంలో భాగస్వాములయ్యారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో తొలి ట్రయల్స్‌ను గతేడాది ఆగస్ట్‌లో విజయవంతం పూర్తి చేసింది. అక్టోబర్‌లో రెండో దశ, ఈ ఏడాది జనవరిలో మూడ దశ ట్రయల్స్ పూర్తయ్యాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక చేరికతో భారత నేవీ బలం మరింత పెరుగనున్నది. ఈ నౌకలో 14 అంతస్తులుంటాయి. దీని బరువు 40వేల టన్నులు. 30 నుంచి 40 విమానాలను దీనిపై ఉంచొచ్చు. నౌక పొడువు 262 మీటర్లు, ఎత్తు 59 మీటర్ల ఉంటుంది. ప్రస్తుతం భారత నావికాదళం ఐఎన్ఎస్ విక్రమాదిత్యను కలిగి ఉంది. ఇదే దేశంలో ఏకైక విమాన వాహక నౌక. ఐఎన్ఎస్ విక్రాంత్ చేరికతో నేవీకి మరో వాహక నౌక అందుబాటులోకి రానున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | చూపులతోనే కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి!
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

