హైదరాబాద్, మే 4(నమస్తే తెలంగాణ) : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్‌కు మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ అభినందనలు తెలిపారు. సోమవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ విజయ్ నాయకత్వంపై తమిళ ప్రజలకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
గతంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో విజయ్ విస్తృతంగా పాల్గొన్న విషయాన్ని గుర్తుచేస్తూ సంబంధిత ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు. పర్యావరణ పరిరక్షణ, హరిత స్ఫూర్తిపై విజయ్‌కు ఉన్న నిబద్ధత స్ఫూర్తిదాయకమని కొనియాడారు.