రాష్ర్టాలకు విదేశీ టీకాలు
- త్వరలో ఢిల్లీకి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్: కేజ్రీవాల్
- కేంద్రం వైఖరిని భారత్-పాక్ యుద్ధంతో పోల్చిన ఢిల్లీ సీఎం
- రాష్ర్టాలే ఆయుధాలను సమకూర్చుకోవాలంటే ఎలా అని నిలదీత
- కర్ణాటకకు స్పుత్నిక్ వి, స్పుత్నిక్ లైట్
- సరఫరాకు ముందుకు వచ్చిన సంస్థలు

న్యూఢిల్లీ/బెంగళూరు, మే 26: అంతర్జాతీయ మార్కెట్ నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేయడానికి పలు రాష్ర్టాలు చేస్తున్న ప్రయత్నాలకు స్పందన వస్తున్నది. రష్యా తయారీ ‘స్పుత్నిక్ వీ’ వ్యాక్సిన్ తమ రాష్ర్టానికి సరఫరా కానున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘రాష్ట్ర అధికారులకు, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారీ ప్రతినిధులకు మధ్య చర్చలు జరుగుతున్నాయి.
ఈ వ్యాక్సిన్ త్వరలోనే రాష్ర్టానికి రానుంది’ అని తెలిపారు. రాష్ర్టాలు అంతర్జాతీయ మార్కెట్ నుంచి వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని కేంద్రం చెప్తున్నదని, కానీ కొన్ని కంపెనీలు సరఫరా చేయడానికి నిరాకరిస్తున్నాయని పేర్కొన్నారు. ‘వ్యాక్సిన్ల కోసం చాలా రాష్ర్టాలు గ్లోబల్ టెండర్లకు వెళ్తున్నాయి. కానీ చాలా కంపెనీలు నేరుగా రాష్ర్టాలకు సరఫరా చేయడానికి నిరాకరిస్తున్నాయి’ అని కేజ్రీవాల్ చెప్పారు. కరోనాపై పోరులో కేంద్రం తన బాధ్యతను మరువకూడదని సూచించారు. కేంద్రమే వ్యాక్సిన్లను కొనుగోలు చేసి రాష్ర్టాలకు సరఫరా చేయాలని కోరారు. ‘భారత్‌పై పాకిస్థాన్ యుద్ధం ప్రకటిస్తే.. ఢిల్లీ అణుబాంబును తయారు చేసిందా?.. ఉత్తరప్రదేశ్ యుద్ధట్యాంకును తెచ్చిందా? అని కేంద్రం అడిగినట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉన్నది. వ్యాక్సిన్లను కొనుగోలు చేయడం, రాష్ర్టాలకు సరఫరా చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కర్ణాటక గ్లోబల్ టెండర్లకు స్పందన
రెండు కోట్ల వ్యాక్సిన్ డోసుల కొనుగోలుకు కర్ణాటక ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ప్రకటించగా.. స్పందన వచ్చింది. స్పుత్నిక్ వీ, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్లను తాము సరఫరా చేస్తామంటూ రెండు కంపెనీలు ముందుకువచ్చాయి. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ సరఫరా చేస్తామని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ‘బల్క్ ఎంఆర్వో ఇండస్ట్రియల్ సైప్లె ప్రైవేటు లిమిటెడ్ తెలుపగా.. స్పుత్నిక్ లైట్‌ను తాము సరఫరా చేస్తామని బెంగళూరు చెందిన తులసి సిస్టమ్స్ పేర్కొంది. ఓ అధికారి మాట్లాడుతూ వ్యాక్సిన్ల ధర, ఇతర నిబంధనలు పూర్తయిన తర్వాత టీకాల కొనుగోలు ముందుకు సాగుతుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

