Road Accident | ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు.. మంటలు అంటుకుని ఐదుగురు సజీవదహనం
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బుధవారం తెల్లవారుజామున కరూర్ జిల్లా కుళితలై హైవేపై బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, కారు డ్రైవర్ సజీవదహనమయ్యారు.
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బుధవారం తెల్లవారుజామున కరూర్ జిల్లా కుళితలై హైవేపై బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, కారు డ్రైవర్ సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని చెప్పారు.
మృతులు కోయంబత్తూర్లోని కునియముత్తూరుకు చెందినవారిగా గుర్తించారు. ఒరతనాడులోని కీలైయూర్లో ఉన్న అగ్నివీరనార్ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. అరంతంగి నుంచి తిరువూర్ వెళ్తున్న ప్రభుత్వ బస్సును కారు ఢీకొట్టిందన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ప్రమాదం కారణంగా కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Karur, Tamil Nadu: An accident occurred near Kulithalai, where a government bus traveling from Aranthangi to Tirupur collided head-on with a car on the Karur-Trichy bypass. Five people, including two women, died on the spot. Musiri Fire Department took over half an hour to… pic.twitter.com/zc5jnywi77
— IANS (@ians_india) February 26, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

