చరిత్రలో ఈరోజు : తొలి సినిమా ‘ఆలం ఆరా’ ప్రదర్శించి నేటికి 91 ఏండ్లు
1931 లో సరిగ్గా ఇదే రోజున ముంబైలోని మెజెస్టిక్ సినిమా హాలులో తొలిసారిగా టాకీ సినిమాను ప్రదర్శించారు. ప్రదర్శన సాయంత్రం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆరు గంటల ముందుగా పెద్ద సంఖ్యలో...
Today History: భారతదేశంలో సినిమా ప్రస్తుతం ఎంతో పెద్ద పరిశ్రమగా విరాజిల్లుతున్నది. కోట్ల రూపాయల వ్యాపారాలు జరుగుతున్నాయి. వేలాది మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వీటన్నింటికి దిశగా 91 ఏండ్ల క్రితం ప్రదర్శించిన తొలి టాకీ సినిమా ‘ఆలం ఆరా’ గా చెప్పుకోవాలి. 1931 లో సరిగ్గా ఇదే రోజున ముంబైలోని మెజెస్టిక్ సినిమా హాలులో తొలిసారిగా టాకీ సినిమాను ప్రదర్శించారు. ఇక అప్పటి నుంచి భారతీయ సినీ పరిశ్రమ వెనక్కి తిరిగి చూడకుండా అంతర్జాతీయంగా వెలుగొందుతున్నది.
మన దేశ సినిమా పరిశ్రమ పితామహుడైన దాదా సాహెబ్ ఫాల్కే 1913 లో ‘రాజా హరిశ్చంద్ర’ పేరుతో మూకీ సినిమాను నిర్మించారు. అప్పటి నుంచి సినిమాలు మెల్లమెల్లగా రావడం మొదలయ్యాయి. అయితే, తొలి టాకీ సినిమాగా ‘ఆలం ఆరా’ చరిత్రలో నిలిచింది. 91 ఏండ్ల క్రితం ముంబైలోని మెజెస్టిక్ సినిమా హాలులో ప్రదర్శించేందుకు అంతా సిద్ధం చేశారు. సినిమా ప్రదర్శన సాయంత్రం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆరు గంటల ముందుగా అంటే ఉదయం 9 గంటలకే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాలు వద్దకు వచ్చారు. జనాల్ని అదుపు చేయడం కష్టం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి చిన్నపాటి లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. తొలిరోజునే ఈ సినిమా టికెట్లు బ్లాకులో రూ.50 కి కొనుగోలు చేశారంటే ఎంత క్రేజ్ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.
జోసెఫ్ డేవిడ్ రచించిన పార్సీ నాటకం ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. ఒక యువరాజు-బంజరన్ అమ్మాయి ప్రేమ కథే ఈ సినిమా ఇతివృత్తం. అర్దేశిర్ ఇరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్టర్ విఠల్, జుబేదా, జిల్లో, సుశీల, పృథ్వీరాజ్ కపూర్ తదితరులు నటించారు. ఈ సినిమాలో 7 పాటలున్నాయి. ఈ చిత్రంలోని ‘దే దే ఖుదా కే నామ్ పే’ పాట.. భారతీయ సినిమా తొలి పాటగా పరిగణిస్తారు. స్త్రీలు సినిమాల్లో పనిచేయడం మంచిది కాదనే వాదనతో ఉన్న సమయంలో ఈ సినిమాలో నటించిన జుబైదా.. తొలుత చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందంట. 124 నిమిషాల నిడివి గల ఈ సినిమాను ఇంపీరియల్ మూవీటోన్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాకు సంబంధించి ఒక్క ప్రింటు కూడా ఇప్పుడు అందుబాటులో లేకపోవడం దురదృష్టంగా చెప్పుకోవాలి.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
ఇవాళ ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ జయంతి
- 2018: ప్రముఖ విశ్వోద్భవ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం
- 2013: చైనా అధ్యక్షుడిగా ఎన్నికైన జీ జిన్పింగ్
- 2004: వరుసగా రెండోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్
- 1998: భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికైన సోనియా గాంధీ
- 1965: నటుడు అమీర్ ఖాన్ జననం
- 1963: స్వాతంత్ర్య సమరయోధుడు జయనారాయణ వ్యాస్ మరణం
- 1939: స్వాతంత్ర్యం ప్రకటించుకున్న స్లోవేకియా
- 1883: జర్మన్ తత్వవేత్త, ఆర్థికవేత్త కార్ల్ మార్క్స్ మరణం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

