ఎడారిలో మహిళా కానిస్టేబుల్ సాహసం
ఎడారిలో చిక్కుకుపోయిన 86 ఏండ్ల వృద్ధురాలిని ఓ మహిళా కానిస్టేబుల్ ఐదు కిలోమీటర్ల మేర తన భుజాలపై తీసుకెళ్లి కాపాడారు. 27 ఏండ్ల వర్ష పరమార్ ప్రస్తుతం గుజరాత్‌లోని కచ్ జిల్లా రాపార్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా
ఎడారిలో చిక్కుకుపోయిన 86 ఏండ్ల వృద్ధురాలిని ఓ మహిళా కానిస్టేబుల్ ఐదు కిలోమీటర్ల మేర తన భుజాలపై తీసుకెళ్లి కాపాడారు. 27 ఏండ్ల వర్ష పరమార్ ప్రస్తుతం గుజరాత్‌లోని కచ్ జిల్లా రాపార్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఇద్దరు మహిళలతో కలిసి కచ్ ఎడారి ప్రాంతంలో ఉన్న గుడికి వెళ్లిన ఆ వృద్ధురాలు తిరిగి వస్తుండగా కళ్లు తిరిగి పడిపోయింది.
అక్కడ ఆమె పరిస్థితిని గమనించిన కొందరు రాపార్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. స్పందించిన వర్ష పరమార్ హుటాహుటిన నీళ్ల సీసాతో ఘటనాస్థలికి వెళ్లారు. ఆమెకు నీరు తాగించి, సపర్యలు చేసి 5 కిలోమీటర్ల మేర తన భుజాలపై ఎత్తుకుని తీసుకొచ్చింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఆమె మానవతా దృక్పథానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

