FASTags | టోల్ కలెక్షన్లకు కొత్త సిస్టమ్.. కనుమరుగు కానున్న ఫాస్టాగ్‌లు
FASTags | టోల్ ప్లాజాల దగ్గర మాన్యువల్‌గా టోల్ ఛార్జీల వసూలువల్ల రోడ్లపై వాహనాలు భారీగా నిలిచిపోతుండటంతో 2016లో ఆటోమెటిక్‌గా టోల్ వసూలు చేసే ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు కేంద్ర సర్కారు ఫాస్టాగ్‌ల కంటే వేగంగా టోల్ కలెక్ట్ చేసే కొత్త సిస్టమ్‌ను తీసుకురాబోతోంది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ పద్ధతిని అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
FASTags : టోల్ ప్లాజాల దగ్గర మాన్యువల్‌గా టోల్ ఛార్జీల వసూలువల్ల రోడ్లపై వాహనాలు భారీగా నిలిచిపోతుండటంతో 2016లో ఆటోమెటిక్‌గా టోల్ వసూలు చేసే ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు కేంద్ర సర్కారు ఫాస్టాగ్‌ల కంటే వేగంగా టోల్ కలెక్ట్ చేసే కొత్త సిస్టమ్‌ను తీసుకురాబోతోంది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ పద్ధతిని అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూలుకు వాహనదారులు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ తగినంత క్యాష్ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ప్రతిసారి ఇలాంటి తలనొప్పులు లేకుండా ఫాస్టాగ్‌ల నుంచి GPS ఆధారిత టోల్ సిస్టమ్‌కి మారాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల హైవే ప్రయాణం మరింత వేగంగా, సాఫీగా మారుతుంది.
కొత్త సిస్టమ్ ప్రత్యేకతలు
జీపీఎస్ (GPS) ఆధారిత టోల్ సిస్టమ్ అనేది ఒక కొత్త టెక్నాలజీ. ప్రస్తుతం దీనిని ముంబైలోని అటల్ సేతు లాంటి కొన్ని రహదారులపై పరీక్షిస్తున్నారు. ఈ సిస్టమ్ కదిలే వాహనాల నంబర్ ప్లేట్లను ప్రత్యేక కెమెరాలతో స్కాన్ చేస్తుంది. ఆ కెమెరాలు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) టెక్నాలజీతో పనిచేస్తాయి. ఈ సిస్టమ్‌లో వెహికిల్ రిజిస్ట్రేషన్‌కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్ అమౌంట్ డెబిట్ అవుతుంది.
జీపీఎస్ సిస్టమ్‌తో లాభాలు
జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే టోల్ ప్లాజాల వద్ద వాహనాలను ఆపాల్సిన అవసరం రాదు. దాంతో ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. రీఛార్జ్, బ్యాలెన్స్ చెకప్ లాంటి అవసరాలు లేకపోవడంతో యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపడుతుంది. ఎలాంటి అంతరాయం లేకుండా వాహనాలు రాకపోకలు సాగించవచ్చు.
త్వరలో అందుబాటులోకి
2024 ఏప్రిల్ ప్రారంభంలో GPS ఆధారిత టోల్ సిస్టమ్‌ను దేశవ్యాప్తంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌ల విజయం, డేటా ప్రైవసీ లాంటి సమస్యలను పరిష్కరించాక ఈ సిస్టమ్‌ను వెంటనే అమల్లోకి తీసుకురావచ్చు. ఈ GPS ఆధారిత టోల్ సిస్టమ్ భారతదేశంలో హైవే ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చగలదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

