Param Bir Singh: వసూళ్ల కేసులో ముంబై మాజీ పోలీసు కమిషనర్‌కు లుకౌట్ నోటీసులు

థానే: ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ( Param Bir Singh )కు.. థానే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అక్రమ వసూళ్ల కేసులో ఆయనకు ఆ నోటీసులు ఇచ్చారు. పరమ్ బీర్‌తో పాటు ఈ కేసుతో లింకు ఉన్న మరో 27 మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు పోలీసులు చెప్పారు. డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ఏర్పడిన సిట్ బృందం ఈ కేసును దర్యాప్తు చేయనున్నది. లుకౌట్ నోటీసులు ఇచ్చే ప్రక్రియ గత వారమే ముగిసిందని, ప్రస్తుతం సింగ్ నోటీసు అయిపోయిందని, ఇతరుల నోటీసులను రూపొందిస్తున్నామని థానే పోలీసు కమిషనరేట్ పేర్కొన్నది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ప్రతి ఒకరి వాంగ్మూలం తీసుకుంటున్నట్లు కమిషనరేట్ చెప్పింది. ముంబై మాజీ పోలీసు కమీషనర్ పరమ్ బీర్‌తో పాటు 27 మందిపై అక్రమ వసూళ్ల కేసు బుక్ అయిన విషయం తెలిసిందే. దీంట్లో ఉన్నత స్థాయి పోలీసులు, అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్స్, జర్నలిస్టులు కూడా ఉన్న థాన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా డాన్సర్స్ యూనియన్ నూతన కమిటీ ఎంపిక
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

