Akhilesh Yadav: 80 సీట్లు గెలిచినా.. ఈవీఎంలను నమ్మను: అఖిలేశ్ యాదవ్
Akhilesh Yadav: ఈవీఎంలపై నిన్న కూడా నమ్మకం లేదని, ఇవాళ కూడా ఆ నమ్మకం లేదని, ఒకవేళ తమ పార్టీ 80 సీట్లు గెలిచినా.. అప్పుడు కూడా ఆ ఈవీఎంలపై భరోసా లేదని, ఈవీఎంలతో గెలిచినా.. ఆ ఈవీఎంలను తొలగించే వరకు తమ పోరాటం ఆగదని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఈవీఎంలపై నిన్న కూడా నమ్మకం లేదని, ఇవాళ కూడా ఆ నమ్మకం లేదని, ఒకవేళ తమ పార్టీ 80 సీట్లు గెలిచినా.. అప్పుడు కూడా ఆ ఈవీఎంలపై భరోసా లేదని, ఈవీఎంలతో గెలిచినా.. ఆ ఈవీఎంలను తొలగించే వరకు తమ పోరాటం ఆగదని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో ఇవాళ ఆయన మాట్లాడారు. ఎన్నికల వల్ల వర్గ రాజకీయాలకు తెరపడిందని తెలిపారు.
తాజా ఫలితాలు ఇండియా కూటమికి బాధ్యతను అప్పగించాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం.. ఇండియా కూటమికి నైతిక విజయాన్ని అందించిందన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని మోదీ సర్కారుకు లేదని, అందుకే పేపర్ లీకేజీలు అవుతున్నట్లు ఆయన ఆరోపించారు. కుల గణన చేపట్టకుండా న్యాయం అందించలేమన్నారు. ఎన్నికల వేళ కొందరి పట్ల ప్రవర్తనా నియమావళి విషయంలో ఎన్నికల సంఘం ఉదాసీనంగా ఉన్నట్లు తెలిపింది.
#WATCH | On EVMs, Samajwadi Party MP Akhilesh Yadav says,”…EVM pe mujhe kal bhi bharosa nahi tha, aaj bhi nahi hai bharosa, mein 80/80 seats jeet jaun tab bhi nahi bharosa…The issue of EVM has not died” pic.twitter.com/UJIS6hBGQt
— ANI (@ANI) July 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
Thailand Queen: గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్… వీడియో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

