Rajya Sabha | ధన్కర్ Vs జయాబచ్చన్.. పేరు విషయంలో మరోసారి వాగ్వాదం
రాజ్యసభలో శుక్రవారం చైర్మన్ జగదీప్ ధన్కర్, ఎంపీ జయాబచ్చన్ మధ్య పేరు విషయంలో మరోసారి వాగ్వాదం చోటుచేసుకొన్నది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేపై బీజేపీ ఎంపీ ఘనశ్యామ్ తివారీ చేసిన వ్యాఖ్యలపై చైర్మన్, విపక్ష సభ్యుల మధ్య చర్చ జరుగుతున్న క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ మాట్లాడేందుకు అవకాశం కోరారు.
- ‘టోన్’ ఆమోదనీయంగా లేదన్న ఎంపీ
- ఇక చాలు’ అని ఆగ్రహించిన చైర్మన్
Rajya Sabha | న్యూఢిల్లీ: రాజ్యసభలో శుక్రవారం చైర్మన్ జగదీప్ ధన్కర్, ఎంపీ జయాబచ్చన్ మధ్య పేరు విషయంలో మరోసారి వాగ్వాదం చోటుచేసుకొన్నది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేపై బీజేపీ ఎంపీ ఘనశ్యామ్ తివారీ చేసిన వ్యాఖ్యలపై చైర్మన్, విపక్ష సభ్యుల మధ్య చర్చ జరుగుతున్న క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ మాట్లాడేందుకు అవకాశం కోరారు. దీనికి చైర్మన్ ధన్కర్ అనుమతిస్తూ ‘జయా అమితాబ్ బచ్చన్ మీ పాయింట్ ఏంటో చెప్పండి’ అని అన్నారు. తనను జయా అమితాబ్ బచ్చన్ అని సంబోధించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నేను జయా అమితాబ్ బచ్చన్‌ను ఒకటి చెప్పాలని అనుకొంటున్నా.. మీ గొంతు టోన్ ఆమోదనీయంగా లేదు. నేను ఒక ఆర్టిస్టును. బాడీ లాంగ్వేజ్, వ్యక్తీకరణలను నేను అర్థం చేసుకోగలను’ అంటూ మాట్లాడుతుండగా జోక్యం చేసుకొన్న చైర్మన్ ధన్కర్ ‘ఇక చాలు’ అని అన్నారు. ‘ మీరు సెలబ్రిటీ కావొచ్చు లేదా మరెవరైనా కావొచ్చు. మీరు మంచి ప్రవర్తనను పాటించాల్సిందే’ అని పేర్కొన్నారు. జయాబచ్చన్ ఒక సీనియర్ ఎంపీ అని, చైర్మన్ ఆమెను ఒక సెలబ్రిటీ అని ఎలా పిలుస్తారని విపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ధన్కర్, జయాబచ్చన్ మధ్య వాగ్వాదం తర్వాత ప్రతిపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. గత 10 రోజుల వ్యవధిలో ఆమె పేరు విషయంలో వాగ్వాదం జరగడం ఇది మూడోసారి.
పార్లమెంట్ నిరవధిక వాయిదా
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. లోక్‌సభ, రాజ్యసభలను స్పీకర్, చైర్మన్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 12 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగాల్సి ఉండగా, మూడు రోజుల ముందుగానే నిరవధికంగా వాయిదా పడటం గమనార్హం. ఈ సమావేశాల్లో వక్ఫ్ చట్టం-1995ను సవరిస్తూ కేంద్రం ఓ బిల్లును ప్రవేశపెట్టడంపై వివాదం రేగిన విషయం తెలిసిందే.
ఉపరాష్ట్రపతిపై అభిశంసన తీర్మానం?
ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ను తొలగించేలా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండియా కూటమి పార్టీలు యోచిస్తున్నాయి. ఇందుకు సంబంధించి నోటీసు సమర్పించే సమయంపై పార్టీలు చర్చించనున్నాయని, తీర్మానం ఆమోదం పొందకపోయినప్పటికీ, సభలో చైర్మన్ ధనకర్ పక్షపాత తీరును హైలెట్ చేసినట్టు అవుతుందని భావిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. విపక్ష నేతల మైక్‌ను పదేపదే కట్ చేస్తున్నారని, రూల్స్‌కు అనుగుణంగా సభ నడవడం లేదని విపక్ష పార్టీలు అంటున్నాయి
.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

