తెలుగులో ఇంజినీరింగ్

- మరో నాలుగు భారతీయ భాషల్లో కూడా
- జాతీయ నూతన విద్యా విధానానికి ఏడాది పూర్తి
- జాతి నిర్మాణంలో ఎన్ఈపీ కీలకమన్న ప్రధాని మోదీ
- ఏబీసీ, విద్యాప్రవేశ్ తదితర ప్రొగ్రామ్‌ల ప్రారంభం
న్యూఢిల్లీ, జూలై 29: జాతి నిర్మాణం కోసం సాగుతున్న మహాయజ్ఞంలో నూతన విద్యా విధానం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. గ్రామీణ యువతకు ఉన్నత విద్యను మరింత సరళీకృతం చేయడంలో భాగంగా.. స్థానిక భాషలోనే విద్యాబోధన చేయనున్నట్టు వెల్లడించారు. ఇంజినీరింగ్ కోర్సులను ఐదు భాషల్లో బోధించనున్నట్టు పేర్కొన్నారు. యువత తమ కలలను సాకారం చేసుకోవడంలో ఈ కొత్త విధానం దోహదపడుతుందన్నారు. నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా గురువారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రధాని ్రప్రారంభించిన విద్యా కార్యక్రమాలు
- ఎనిమిది రాష్ర్టాల్లోని 14 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఐదు భారతీయ భాషల్లో (హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ) విద్యా బోధన.
- ఇంజినీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా ప్రత్యేక టూల్ అభివృద్ధి.
- అకడెమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ) ఆవిష్కరణ. నూతన విద్యా విధానంలో భాగంగా దీన్ని ప్రతిపాదించారు. ఏబీసీలో భాగంగా విద్యార్థులు తమ అభీష్టానుసారం ఉన్నత చదువుల అభ్యాసానికి ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రవేశం, నిష్క్రమణ వెసులుబాట్లు (మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్) కలిగిఉంటారు. అంటే మూడేండ్ల డిగ్రీ కోర్సులో చేరిన ఓ విద్యార్థి మొదటి ఏడాది పూర్తయ్యాక, వేరే డిప్లొమా కోర్సు చేయాలనుకుంటే చేయొచ్చు. అప్పటికే చదివిన డిగ్రీ మొదటి ఏడాది ఏ మాత్రం వృథా కాదు. దానికి సంబంధించిన క్రెడిట్స్, కరస్పాండింగ్ సర్టిఫికెట్‌ను విద్యార్థికి జారీ చేస్తారు. విద్యార్థి మళ్లీ డిగ్రీలో ప్రవేశాన్ని కోరితే, రెండో ఏడాది నుంచి కోర్సును కొనసాగించవచ్చు.
- అప్పుడే పాఠశాల విద్యలో ప్రవేశించే చిన్నారుల కోసం మూడు నెలలపాటు ఆటపాటలతో కూడిన ‘విద్యాప్రవేశ్’ ప్రోగ్రామ్ ప్రారంభం.
- దివ్యాంగుల కోసం సెకండరీ విద్యలో ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌ను ఒక సబ్జెక్ట్‌గా తీసుకువస్తున్నట్టు ప్రకటన.
- సీబీఎస్ఈ 3, 5, 8 తరగతుల పిల్లల సర్వోన్నతాభివృద్ధికి సఫల్ (స్ట్రక్చర్డ్ అసెస్మెంట్ ఫర్ ఎనలైజింగ్ లెర్నింగ్ లెవల్స్) ప్రోగ్రామ్.
- ఉపాధ్యాయులకు శిక్షణ నిమిత్తం ఎన్సీఈఆర్టీ అభివృద్ధి చేసిన ‘నిష్ఠా 2.0’ కార్యక్రమం ప్రారంభం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

