X : భారత ప్రభుత్వాన్ని కోర్టులో సవాల్ చేసిన ఎక్స్ సంస్థ
X : సోషల్ మీడియా ఎక్స్ సంస్థ.. భారత ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. కర్నాటక హైకోర్టులో దావా దాఖలు చేసింది. ఐటీ చట్టంలోని 79(3)(బీ) సెక్షన్‌ను భారత ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నట్లు చెప్పింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏను సర్కారు విస్మరిస్తోందని ఎక్స్ ఆరోపించింది. సెన్సార్షిప్, ఐటీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది.
బెంగుళూరు: బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన ఎక్స్(X) సోషల్ మీడియా సంస్థ.. భారత సర్కారుపై కోర్టులో దావా దాఖలు చేసింది. కర్నాటక హైకోర్టులో ఆ కేసును ఫైల్ చేసింది. భారత ప్రభుత్వం అక్రమ రీతిలో కాంటెంట్‌ను నియంత్రిస్తున్నదని, సెన్సార్‌షిప్‌కు పాల్పడుతున్నట్లు ఆ దావాలో ఎక్స్ సంస్థ ఆరోపించింది. భారత సర్కారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని వాడుతున్న తీరుపై ఎక్స్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఐటీ చట్టంలోని 79(3)(బీ) సెక్షన్‌ను భారత ప్రభుత్వం అక్రమరీతిలో వినియోగిస్తున్నట్లు ఎక్స్ ఆరోపించింది. ఆ సెక్షన్ అమలు.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నట్లు ఎక్స్ తన దావాలో పేర్కొన్నది. ఆ సెక్షన్ ద్వారా ఆన్లైన్లో భావస్వేచ్ఛను అడ్డుకుంటున్నట్లు ఎక్స్ ఆరోపించింది.
79(3)(బీ) సెక్షన్‌ను ప్రభుత్వం దుర్వినియోగంచేస్తున్నట్లు ఎక్స్ సంస్థ తెలిపింది. ఆ సెక్షన్ ద్వారా సహయోగ్ పోర్టల్‌ను సమాంతరంగా నడపాలని భావిస్తున్నట్లు పేర్కొన్నది. సెక్షన్ 69ఏను ఉల్లంఘిస్తూ ప్రభుత్వం కాంటెంట్ బ్లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నదని ఎక్స్ ఆరోపించింది. 2015లో శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం ఉల్లంఘిస్తున్నట్లు ఎక్స్ పేర్కొన్నది. కాంటెంట్‌ను బ్లాక్ చేయాలంటే అది న్యాయ ప్రక్రియ ద్వారా జరగాలని, లేదంటే 69ఏ సెక్షన్ ప్రకారం జరగాలని ఎక్స్ తెలిపింది.
సెక్షన్ 79 ప్రకారం.. ఏదైనా అక్రమ కాంటెంట్ ఉంటే.. కోర్టు ఆదేశాలు లేదా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ఆన్లైన్ సంస్థలు ఆ కాంటెంట్‌ను తీసివేయాల్సి ఉంటుంది. ఒకవేళ 36 గంటల్లో ఆన్లైన్ సంస్థ ఆ కాంటెంట్‌ను తీయలేని పక్షంలో.. ఆ సంస్థ ఐపీసీ చట్టాల ప్రకారం న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి వస్తోందని ఎక్స్ తన పిటీషన్లో తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

