Chhattisgarh Elections | ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు.. పోలింగ్ ఏయే తేదీల్లో అంటే..!
Chhattisgarh Elections | ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఆ రాష్ట్రంలో పలు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నందున భద్రతా కారణాల రీత్య రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఆ రాష్ట్రంలో పలు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నందున భద్రతా కారణాల రీత్య రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. నవంబర్ 7న తొలి విడత పోలింగ్, నవంబర్ 17న రెండో విడత పోలింగ్ జరుగుతుందని ప్రకటించారు.
తొలి విడతలో పోలింగ్ జరిగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అక్టోబర్ 13న గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలై అక్టోబర్ 20 వరకు కొనసాగనుంది. అక్టోబర్ 21న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. అక్టోబర్ 23 ను నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. నవంబర్ 7న పోలింగ్ జరుగుతుంది.
రెండో విడత పోలింగ్‌కు సంబంధించి అక్టోబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ విడుదలై అదే రోజు నామినేషన్లు మొదలుకానున్నాయి. అక్టోబర్ 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 31న నామినేషన్ల స్క్రూటినీ నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 2 వరకు అవకాశం కల్పించారు. నవంబర్ 17న రెండో దశ పోలింగ్ జరుగుతుంది. రెండు విడతల్లో పోలైన ఓట్లను డిసెంబర్ 3న లెక్కించనున్నారు.
కాగా, ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఆ రాష్ట్రంలో 2018కి ముందు దాదాపు 15 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 68 స్థానాలు, బీజేపీ 15 స్థానాలు, ఇతరులు మిగతా స్థానాల్లో విజయం సాధించారు. భూపేశ్ బఘేల్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

