Election Commission | నేడు అన్ని రాజకీయ పార్టీలతో ఎలక్షన్ కమిషన్ భేటీ.. రిమోట్ ఓటింగ్ మెషిన్‌పై చర్చ
రిమోట్ ఓటింగ్ మెషిన్ (ఆర్వీఎం) మీద అవగాహన కార్యక్రమం
Election Commission : ఈరోజు దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలతో భారత ఎన్నికల సంఘం భేటీ కానుంది. రిమోట్ ఓటింగ్ మెషిన్ (ఆర్వీఎం) మీద అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ మెషిన్ పనితీరు గురించి రాజకీయ పార్టీలకు వివరించడంతో పాటు పలు విషయాల మీద చర్చించనుంది. అందుకని 8 జాతీయ పార్టీలు, 57 ప్రాంతీయ పార్టీలకు చెందిన అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు ఈ మీటింగ్‌కు తప్పనిసరిగా హాజరు కావాలని ఈసీ కోరింది. అంతేకాదు ఈ కొత్త మెషిన్ల పనితీరుకు సంబంధించి, ఎన్నికల పద్ధతిలో మార్పులు, దేశంలోని వలస కూలీల గురించి తమఅభిప్రాయాలను రాత పూర్వకంగా జనవరి 31లోపు తెలియజేయాలని చెప్పింది. ఈ అవగాహన కార్యక్రమంలో ఎన్నికల సంఘానికి చెందిన సాంకేతిక నిపుణులు కూడా పాల్గొననున్నారు.
ఓటింగ్ శాతం పెంచడం కోసం
బతుకుదెరువు నిమ్మిత్తం పొరుగు రాష్ట్రాలు, జిల్లాలకు వలస వెళ్లినవాళ్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం భారత ఎన్నికల సంఘం సరికొత్త ఆలోచన చేసింది. డిసెంబర్ 29న మల్టీ కాన్స్టిట్యుయెన్సీ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఆర్వీఎం) నమూనా మెషిన్‌ను ప్రదర్శించింది. దాంతో, ఓటర్లు ఏ ప్రాంతంలో ఉన్నా సరే.. అక్కడి రిమోట్ పోలింగ్ స్టేషన్లలో ఓటు వేసే వీలుంది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడానికి అంతరాష్ట్ర వలసలు ప్రధాన కారణమని ఈసీ తెలిపింది. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే.. వలస కూలీలు ఓటు హక్కు వినియోగించుకోవడం స్వరాష్ట్రానికి, జిల్లాకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, దాంతో, ఓటింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

