Pune | కారుకు సైడివ్వలేదని.. మహిళ ముక్కు పగలగొట్టాడు
తన కారుకు సైడ్ ఇవ్వలేదని స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళను తన పిల్లల ముందే ముక్కుపగిలేలా కొట్టాడో వ్యక్తి. కలకలం సృష్టించిన ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో (Pune) జరిగింది. జర్నిల్ డిసిల్వ అనే 27 ఏండ్ల మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటర్‌పై పుణెలోని బనెర్-పాషన్ రోడ్డుపై వెళ్తున్నారు.
పుణె: తన కారుకు సైడ్ ఇవ్వలేదని స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళను తన పిల్లల ముందే ముక్కుపగిలేలా కొట్టాడో వ్యక్తి. కలకలం సృష్టించిన ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో (Pune) జరిగింది. జర్నిల్ డిసిల్వ అనే 27 ఏండ్ల మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటర్‌పై పుణెలోని బనెర్-పాషన్ రోడ్డుపై వెళ్తున్నారు. ఆమె వెనకాలే దాదాపు 2 కిలోమీటర్ల వరకు కారులో వచ్చిన స్వప్నిల్ కెక్రే అనే వ్యక్తి ఆమెను ఓవర్టేక్ చేశాడు. అయితే ఒక్కసారిగా స్కూటీ ముందు ఆపి పిల్లల ముందే ఆమె ముక్కుపై పిడిగుద్దులు కురిపించడం ప్రారంభించాడు. తీవ్రంగా కొట్టడంతో ఆమె ముక్కు నుంచి రక్తస్రావమైంది. జరిగిన ఉదంతాన్ని వివరిస్తూ ఆమె వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
దారివ్వలేదని ఆరోపిస్తూ తనపై దాడికి పాల్పడ్డాడని ఆ వీడియోలో పేర్కొన్నారు. జుట్టు పట్టుకొని విచక్షణారహితంగా ముఖంపై కొట్టడాని చెప్పారు. ఆయనతోపాటు కారులో మరో వ్యక్తి కూడా ఉన్నాడని తెలిపారు. పుణెలో భద్రత ఎక్కుడుందని ప్రశ్నించారు. తనలాగే మరొకరికి జరగొచ్చని, పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అది పోలీసుల దృష్టికి వెళ్లింది. రంగంలోకి దిగన పోలీసులు జర్నిల్ ఇంటికి వెళ్లారు. ఆమె నుంచి వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన నిందితుడితోపాటు ఆ సమయంలో కారులో అతని భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవిష్యత్ బీఆర్ఎస్దే
క్యాన్సర్ జయించిన చిన్నారులతో వేడుకలు
Health Tips | ఊబకాయం బాగా ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Crime News | తల్లిని కత్తితో పొడిచి, భవనంపై నుంచి దూకి.. తొమ్మిదో తరగతి బాలుడి ఆత్మహత్య..!
Tirumala News | శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి నెల కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

