Eknath Shinde | నిజమైన ద్రోహులు ఎవరో ప్రజాతీర్పే స్పష్టం చేసింది : ఏక్నాథ్ షిండే
Eknath Shinde | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన పార్టీ చీఫ్ ఏక్నాథ్ షిండేను ద్రోహిగా పేర్కొంటూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కునాల్ వ్యాఖ్యలపై శివసేన, బీజేపీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తుండగా, ఉద్ధవ్ థాకరే శివసేన సమర్థిస్తూ వస్తున్నది.
Eknath Shinde : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన పార్టీ చీఫ్ ఏక్నాథ్ షిండేను ద్రోహిగా పేర్కొంటూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కునాల్ వ్యాఖ్యలపై శివసేన, బీజేపీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తుండగా, ఉద్ధవ్ థాకరే శివసేన సమర్థిస్తూ వస్తున్నది. షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కునాల్ కమ్రా వెంటనే క్షమాపణ చెప్పాలని మహా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని, ఏక్నాథ్ షిండేను ద్రోహి అంటే తప్పెలా అవుతుందని ఉద్ధవ్ శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై తాజాగా ఏక్నాథ్ షిండే స్పందించారు. మహారాష్ట్ర శాసన మండలిలో షిండే ప్రసంగిస్తూ.. ఉద్ధవ్ శివసేన, ఇతర ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగం గురించి, వాక్ స్వాతంత్య్రం గురించి మాట్లాడుతున్నాయని, గతంలో వాళ్లెందుకు వాళ్లను విమర్శించిన వారిపట్ల కఠినంగా వ్యవహరించారని ప్రశ్నించారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో 2020లో నటి కంగనా రనౌత్ ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంపై విమర్శలు చేశారని, అప్పుడు ముంబైలో ఆమె ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేశారని అప్పుడు వాక్ స్వాతంత్య్రం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన తనను మాటిమాటికి ద్రోహి అంటుండటంపై ఏక్నాథ్ షిండే స్పందించారు. ఎవరు నిజమైన ద్రోహులో ప్రజాతీర్పే స్పష్టం చేసిందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ శివసేన కంటే తన పార్టీకే ఎక్కువ సీట్లు దక్కడాన్ని ఆయన గుర్తుచేశారు.
కాగా, ఏక్నాథ్ షిండే 2022లో శివసేన నుంచి 40 మంది ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీతో చేతులు కలిపారు. దాంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కుప్పకూలింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో బీజేపీ, ఏక్నాథ్ శివసేన సంకీర్ణ సర్కారు ఏర్పాటైంది. అప్పటి నుంచి ఉద్ధవ్ థాకరే శివసేన నాయకులు ఏక్నాథ్ షిండేను ద్రోహి అంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా ఏక్నాథ్ షిండే పేరును ప్రస్తావించకుండానే ఆయన ద్రోహి అంటూ పాట పాడారు.
ఈ విషయంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వార్నింగ్ ఇచ్చినా ఏక్నాథ్ షిండేకు క్షమాపణ చెప్పేందుకు కునాల్ కమ్రా నిరాకరించారు. తాను విచారణలో పోలీసులకు సహకరిస్తానని, షిండేకు క్షమాపణ చెప్పేది లేదని తేల్చిచెప్పారు. కాగా ఉద్ధవ్ థాకరే శివసేన సుపారీ ఇచ్చి తనపై కునాల్ కమ్రాతో కామెంట్స్ చేయించిందని ఏక్నాథ్ షిండే ఆరోపించారు. సుపారీ ఎంత ఇచ్చినా తనను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Wake Up Stroke | వేక్-అప్ స్ట్రోక్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఏం చేయాలి..?
Dead Bodies | ప్రకాశం జిల్లాలో కలకలం..బీచ్‌కు కొట్టుకువచ్చిన నాలుగు మృతదేహాలు
Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. అయితే ఉదయాన్నే ఈ పని చేయండి..!
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

