Tamil Nadu | మనీలాండింగ్ కేసులో మరోసారి ఈడీ దాడులు..
Tamil Nadu | మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమిళనాడులో గురువారం మరోసారి దాడులు చేసింది. మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధించిన కేసులో దాడులు నిర్వహించినట్లు తెలుస్తున్నది.
Tamil Nadu | మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమిళనాడులో గురువారం మరోసారి దాడులు చేసింది. మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధించిన కేసులో దాడులు నిర్వహించినట్లు తెలుస్తున్నది. కోయంబత్తూరు, కరూర్‌లలో మంత్రి సెంథిల్ బినామీదారుల ప్రదేశాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. మనీలాండరింగ్‌కు సంబంధించి మంత్రి సెంథిల్ బాలాజీ ఇంటితో పాటు కార్యాలయాల్లో జూన్ 14న ఈడీ దాడులు జరిపింది. ఆ తర్వాత ఆయనను అరెస్టు చేయగా.. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.
అయితే, అరెస్టు అయినా సెంథిల్ బాలాజీని ప్రభుత్వం మంత్రి పదవి నుంచి ఇంకా తొలగించలేదు. మరో వైపు బెయిల్ కోసం సెంథిల్ బాలాజీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఈడీ స్పందన కోరింది. ఆయన విచారణ కోసం సహకరించడం లేదని, తన పదవిని దుర్వినియోగం చేసి రవాణాశాఖలో ఉద్యోగాల పేరిట కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. ఇంతకుముందు సెంథిల్ బాలాజీకి బెయిల్ మంజూరు చేసేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బాలాజీ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

