డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన బీజేపీ నేత.. పోలీసులతో అనుచితంగా ప్రవర్తన
మద్యం సేవించి కారు నడిపిన బీజేపీ నేతను పోలీసులు పట్టుకున్నారు. అయితే డ్రంకన్ డ్రైవ్లో దొరికిన ఆయన పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు.
లక్నో: మద్యం సేవించి కారు నడిపిన బీజేపీ నేతను పోలీసులు పట్టుకున్నారు. అయితే డ్రంకన్ డ్రైవ్లో దొరికిన ఆయన పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ యువ మోర్చా ఘజియాబాద్ యూనిట్ కార్యకర్త అయిన రాహుల్ భాటి బుధవారం అర్ధరాత్రి తర్వాత మద్యం సేవించి కారు డ్రైవ్ చేశాడు. పెద్ద శబ్దం చేస్తూ కారును వేగంగా నడపడాన్ని డ్రంకన్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు గమనించారు. దంకౌర్ ప్రాంతంలో ఆ కారును అడ్డుకుని తనిఖీ చేశారు.
కాగా, మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడంపై బీజేపీ కార్యకర్త రాహుల్ భాటిని పోలీసులు నిలదీశారు. కారుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు అతడి వద్ద లేకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా డ్యూటీలో ఉన్న పోలీసుల పట్ల రాహుల్ భాటి అనుచితంగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని అరెస్ట్ చేసినట్లు గ్రేటర్ నోయిడా డీసీపీ అభిషేక్ వర్మ తెలిపారు. ఆ వ్యక్తి కారు ముందు అద్దంపై బీజేవైఎం, బీజేపీ జెండా స్టికర్లు ఉన్నాయని చెప్పారు. కారు సైడ్ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతోపాటు శబ్దాలు చేసే సైరన్, హౌటర్ వంటివి కూడా ఉన్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఆ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

