రికార్డు సృష్టించిన డోలో 650.. రూ. 307 కోట్ల టర్నోవర్ నమోదు
Dolo 650 | కరోనా విజృంభించినప్పటికీ అత్యధికంగా వినియోగంలో ఉన్న మెడిసిన్ ఏదైనా ఉందా? అంటే.. అది కేవలం డోలో 650 అని చెప్పొచ్చు. సాధారణంగా జ్వరం వచ్చినా, ఒళ్లు నొప్పులతో

న్యూఢిల్లీ : కరోనా విజృంభించినప్పటికీ అత్యధికంగా వినియోగంలో ఉన్న మెడిసిన్ ఏదైనా ఉందా? అంటే.. అది కేవలం డోలో 650 అని చెప్పొచ్చు. సాధారణంగా జ్వరం వచ్చినా, ఒళ్లు నొప్పులతో పాటు చలి జ్వరం వచ్చినా వెంటనే డోలో 650 వేసుకుంటాం. దీంతో కాస్త రిలీఫ్ ఉంటుంది.
అయితే జ్వరం రావడం, బాడీ పెయిన్స్ తో పాటు జలుబు ఉంటే కరోనా లక్షణాలుగా గుర్తించారు. ఈ లక్షణాలు ఉన్న వారు మొదటగా డోలో 650 మెడిసిన్‌నే ఉపయోగించారు. ఆ మెడిసిన్ వాడకంతో చాలా మంది కరోనా నుంచి బయటపడ్డారని చెప్పొచ్చు. కొవిడ్ 19 రోగులకు ఫీవర్ మెడిసిన్‌గా డోలో 650 వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
కొవిడ్ నివారణకు ప్రధానంగా ఉపయోగించిన డోలో 650 మెడిసిన్ ఈ రెండేండ్ల కాలంలో రికార్డు సృష్టించింది. మార్చి 2020 నుంచి నేటి వరకు 350 కోట్లకు పైగా డోలో 650 పిల్స్ వినియోగించినట్లు తేలింది. కొవిడ్ కాలంలో బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ దాదాపు 7.5 కోట్ల డోలో స్ట్రిప్స్‌ను అమ్మినట్లు హెల్త్ కేర్ రీసెర్చ్ సంస్థ IQVIA వెల్లడించింది.
అయితే డోలో 650 మెడిసిన్ 2021లో రూ. 307 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసినట్లు డాటాలో స్పష్టమైంది. ఇక జీఎస్కే ఫార్మా కంపెనీ కాల్పూల్ మెడిసిన్‌ను విక్రయించి రూ. 310 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయగా, క్రొసిన్ ట్యాబ్లెట్‌ను అమ్మి రూ. 23.6 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

