Cough Syrups: డాక్టర్ ప్రిస్క్పిప్షన్ ఉంటేనే దగ్గు సిరప్లు.. కేంద్రం కఠిన ఆదేశాలు
Cough Syrups: డాక్టర్ చీటీ ఉంటేనే ఇక నుంచి మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ అమ్ముతారు. డ్రగ్స్ చట్టంలో ప్రభుత్వం తాజాగా సవరణ చేపట్టింది. దీంతో డాక్టర్ ప్రిస్క్పిప్షన్ ఉంటేనే దగ్గు మందు అమ్మాలని నిర్ణయించారు. షెడ్యూల్ కే లిస్టు నుంచి సిరప్‌లను తొలగించారు.
న్యూఢిల్లీ: దగ్గు సిరప్‌ల(Cough Syrups) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దగ్గు సిరప్‌లను కొనేందుకు డాక్టర్ ప్రిస్క్పిప్షన్ తప్పనిసరి అని కేంద్రం పేర్కొన్నది. ఈ నేపథ్యంలో నోటీఫికేషన్ జారీ చేసింది. 1945 నాటి డ్రగ్ రూల్స్ లోనూ సవరణలు చేశారు. తమిళనాడుకు చెందిన శ్రీసన్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తాగి సుమారు 20 మంది చిన్నారులు మృతిచెందారు. అయితే ఆ ఘటన పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ తయారీకి చెందిన దగ్గు మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో తన హెచ్చరికల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. 2026 డ్రగ్స్ రూల్స్‌ను కేంద్రం నోటిఫై చేసింది. పాత చట్టానికి సవరణలు చేశారు.
షెడ్యూల్ కేలో భాగంగా సిరప్ పదాన్ని ఆ కేటగిరీ నుంచి తొలగించారు. డ్రగ్స్ యాక్ట్ 1940 ప్రకారం ఆ కేటగిరీలో కొన్ని మందుల తయారీ, సరఫరా, అమ్మకాలపై నిషేధం మినహాయింపు ఇస్తారు. షెడ్యూల్ కేలో ఉన్న డ్రగ్స్‌ను ఎటువంటి లైసెన్సు లేకుండానే అమ్ముకోవచ్చు. ఇంటి చిట్కాలుగా భావిస్తూ ఆస్పరిన్, పారాసిటమాల్, అనల్జసిక్ బామ్స్ లాంటి కొన్ని మందులు అమ్ముకునేందుకు వీలు ఉంది.అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్ నుంచి సిరప్ అనే పదాన్ని తొలగించారు. దగ్గు కోసం వాడే సిరప్లు, లాజెంజిస్, పిల్స్, ట్యాబ్లెట్లు కూడా అందులో ఉన్నాయి. ప్రభుత్వం అధికారిక గెజిట్ ప్రచురించడం వల్ల కొత్తగా చేపట్టిన సవరణ అమలులోకి వచ్చేస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

