Doctor Gets Fake Note | రూ.500 నకిలీ నోటు ఇచ్చిన రోగి.. మోసానికి గుర్తుగా దాచుకున్న డాక్టర్
Doctor Gets Fake Note | ఒక రోగి ఏకంగా డాక్టర్‌ను మోసగించాడు. కన్సల్టేషన్ ఫీజు కింద రూ.500 నకిలీ నోటు ఇచ్చాడు (Doctor Gets Fake Note). అనంతరం ఆ నకిలీ నోటును గుర్తించిన ఆ డాక్టర్, ఆ పేషంట్ తనను మోసగించాడని తెలుసుకున్నారు. అయితే ఈ మోసానికి గుర్తుగా ఆ నకిలీ నోటును ఆయన దాచుకున్నారు.
న్యూఢిల్లీ: ఒక రోగి ఏకంగా డాక్టర్‌ను మోసగించాడు. కన్సల్టేషన్ ఫీజు కింద రూ.500 నకిలీ నోటు ఇచ్చాడు (Doctor Gets Fake Note). అనంతరం ఆ నకిలీ నోటును గుర్తించిన ఆ డాక్టర్, ఆ పేషంట్ తనను మోసగించాడని తెలుసుకున్నారు. అయితే ఈ మోసానికి గుర్తుగా ఆ నకిలీ నోటును ఆయన దాచుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. డాకర్ట్ మానన్ వోరా, ఆర్థోపెడిక్ సర్జన్. ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం, వీడియోలు కూడా ఆయన షేర్ చేస్తుంటారు. ఇటీవల ఒక రోగి తన వద్దకు వచ్చినట్లు డాక్టర్ మానన్ తెలిపారు. అయితే కన్సల్టేషన్ ఫీజు కింద పిల్లల ప్రాజెక్ట్ వర్క్ కోసం వినియోగించే రూ.500 నకిలీ నోటును రిసెప్షనిస్ట్‌కు చెల్లించినట్లు చెప్పారు. తన సిబ్బంది ఆ నోటును తనిఖీ చేయకుండానే అతడి నుంచి తీసుకున్నట్లు వివరించారు.
కాగా, సాధారణంగా వైద్యం కోసం వచ్చిన పేషంట్ నకిలీ నోటు ఇచ్చి మోసగిస్తారన్నది ఎవరూ కూడా ఊహించరని డాకర్ట్ మానన్ తెలిపారు. కొంత మంది మాత్రం డాక్టర్‌ను కూడా ఇలా మోసగిస్తారనేందుకు ఈ నకిలీ నోటు నిదర్శనమని అన్నారు. అయితే అది నకిలీ నోటు అన్నది నిజంగా పేషంట్‌కు తెలియకుండానే ఇచ్చాడా? లేక మోసపూరితంగా ఇచ్చాడా? అన్నది నమ్మశక్యంగా లేదన్నారు. ఏమైనప్పటికీ ఇది తెలుసుకుని తాను బాగా నవ్వుకున్నట్లు డాక్టర్ మానన్ తెలిపారు. అలాగే నకిలీ నోటు ఇచ్చి తన నుంచి రూ.500 దోచుకున్న మోసానికి గుర్తుగాను, ఒక సరదా జ్ఞాపకంగాను ఈ నోట్‌ను దాచుకున్నట్లు చెప్పారు. మెటా ఇటీవల కొత్తగా ప్రారంభించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ థ్రెడ్స్‌లో ఈ విషయాన్ని షేర్ చేశారు.
Post by @dr.mananvoraView on Threads
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్‌లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

