Hit-And-Run Law: హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న ట్రక్కు డ్రైవర్లు.. ఇంతకీ ఆ చట్టంలో చేసిన మార్పేంటి ?
Hit-And-Run Law: హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్త చట్టం ప్రకారం శిక్షను పదేళ్లకు పెంచారు. దీంతో కొత్త చట్టంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపడుతున్నారు. నగదు జరిమానాను పెంచడాన్ని కూడా ట్రక్కు డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు కొత్తగా భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఐపీసీ స్థానంలో ఆ చట్టాన్ని అమలు చేయనున్నారు. అయితే హిట్ అండ్ రన్(Hit-And-Run Law) కేసుల్లో కొత్త చట్టం ప్రకారం ట్రక్కు డ్రైవర్లకు భారీ శిక్ష పడనున్నది. రోడ్డు ప్రమాదాల్లో పెనాల్టీని పెంచేశారు. ఒకవేళ హిట్ అండ్ రన్ కేసు అయితే ఆ డ్రైవర్‌కు పదేళ్ల జైలుశిక్ష పడే ఛాన్సు ఉంది. అనుకోని పరిస్థితిల్లో ప్రమాదం జరిగితే .. ఐపీసీ సెక్షన్ ప్రకారం కేవలం రెండేళ్ల జైలుశిక్ష మాత్రమే ఉండేది. కొత్త చట్టంలో జైలుశిక్షను పెంచడాన్ని నిరసిస్తూ ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా ధర్నా చేపడుతున్నారు.
నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం, ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలకు కొత్త చట్టాన్ని అమలు చేయనున్నారు. ఈ కేసుల్లో ఏడేళ్ల జైలుశిక్షతో పాటు భారీ జరిమానా విధించనున్నట్లు భారతీయ న్యాయ సంహిత బిల్లులో పేర్కొన్నారు. ఒకవేళ ప్రమాదం చేసిన వ్యక్తి ఘటన గురించి ఫిర్యాదు చేయకుంటే, అప్పుడు ఆ శిక్షను పదేళ్లకు పెంచనున్నారు. దీంతో పాటు ఏడు లక్షల ఫైన్ విధించనున్నారు.
కొత్త చట్టం క్రూరంగా ఉందని, భారీ వాహనాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు ట్రక్కు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. భారీ జరిమానా వేయడాన్ని డ్రైవర్లు నిరసిస్తున్నారు. తమ దగ్గర అంత భారీ అమౌంట్ ఎక్కడ ఉంటుందని ఓ డ్రైవర్ ప్రశ్నించాడు. ప్రమాద సమయంలో గాయపడ్డవారిని తరలించేందుకు ప్రయత్నిస్తే అప్పుడు జనం దాడి చేస్తున్నారని, ఇది ఆందోళనకరంగా ఉంటుందని నిరసనకారులు పేర్కొన్నారు. ట్రక్కు, ప్రైవేట్ బస్సు, గవర్నమెంట్ బస్సు, క్యాబ్ డ్రైవర్లు ఆందోళనలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

