DMK MLA Arrested | విజయ్‌పై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్
DMK MLA Arrested | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై అభ్యంతరకరమైన, బెదిరింపు వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే జీఆర్ మార్కండేయన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్‌కు నిరసనగా డీఎంకే కార్యకర్తలు, నేతలు ఆందోళన చేపట్టారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై అభ్యంతరకరమైన, బెదిరింపు వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే జీఆర్ మార్కండేయన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్‌కు నిరసనగా డీఎంకే కార్యకర్తలు, నేతలు ఆందోళన చేపట్టారు. (DMK MLA Arrested) జూలై 18న జరిగిన బహిరంగ సభలో డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కొలత్తూర్ నియోజకవర్గంలో ఓడిన డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌ను సీఎం విజయ్ పరోక్షంగా విమర్శించడంపై ఆయన స్పందించారు. ‘ముఖ్యమంత్రి తన తండ్రి కోసం వెతుకుతున్నానని అసెంబ్లీలో అంటున్నారు. సిగ్గులేని ముఖ్యమంత్రి. అసెంబ్లీలో మిమ్మల్ని మేం చూసుకుంటాం. అసెంబ్లీ తలుపులు మూసివేస్తానని ఆయన అంటున్నారు. ఒకవేళ ఆయన వాటిని మూసివేస్తే, ఆయన ఎముకలు విరిగిపోతాయి. అసెంబ్లీని మూసి చూడమనండి’ అని అన్నారు.
కాగా, సీఎం విజయ్‌కు పరువునష్టం కలిగించేలా, ఆయనను బెదిరించేలా డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీవీకే ప్రతినిధి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. టుటికోరిన్ ఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్‌కు నిరసనగా డీఎంకే నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీస్ చర్యను ఖండిస్తూ నినాదాలు చేశారు.
మరోవైపు ఈ నెల ప్రారంభంలో ముఖ్యమంత్రి విజయ్‌పై వ్యాఖ్యలు చేసిన తిరుచెందూర్ డీఎంకే ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే అదే రోజు బెయిల్‌పై విడుదలయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

