న్యూఢిల్లీ, ఆగస్టు 18: లాలాజలం పరీక్షతో గుండె సంబంధిత వ్యాధులను ముందస్తుగా గుర్తించవచ్చని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. లాలాజలంలో ఉండే తెల్ల రక్త కణాలకు హృదయ సంబంధిత వ్యాధుల మధ్య సంబంధం ఉందని కెనడా పరిశోధకులు కనుగొన్నారు. 18-30 ఏండ్ల మధ్య వయసున్న పొగ తాగని 28 మందిని పరిశోధనలకు ఎంచుకున్నారు.
ఆరు గంటల పాటు తాగునీరు మినహా వారికి ఎటువంటి ఆహారం అందించలేదు. అదే సమయంలో రక్తపోటు, ధమనులలో రక్త ప్రవాహ సమయంలో వ్యాకోచం తదితరాలను నమోదు చేసుకున్నారు. వారి లాలాజలంలో తెల్ల రక్త కణాల సంఖ్యకు గుండె సంబంధిత వ్యాధులకు మధ్య సంబంధం ఉన్నట్టు గుర్తించారు.