Delivery Agent Rapes Woman | మహిళపై డెలివరీ ఏజెంట్ లైంగిక దాడి.. పోలీస్ నుంచి గన్ లాక్కొని పరార్
Delivery Agent Rapes Woman | నిత్యవసర వస్తువులు డెలివరీ కోసం వచ్చిన ఏజెంట్ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడి ఆచూకీ గుర్తించగా వారి నుంచి గన్ లాక్కొని పారిపోయాడు.
లక్నో: నిత్యవసర వస్తువులు డెలివరీ కోసం వచ్చిన ఏజెంట్ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడి ఆచూకీ గుర్తించగా వారి నుంచి గన్ లాక్కొని పారిపోయాడు. ఈ నేపథ్యంలో సాయుధ పోలీస్ బలగాలను రప్పించి సెర్చ్ చేశారు. చివరకు నిందితుడి కాలుపై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఒక అపార్ట్మెంట్లో ఉంటున్న మహిళ మొబైల్ యాప్ ద్వారా నిత్యవసరాలకు ఆర్డర్ చేసింది. 23 ఏళ్ల సుమిత్ సింగ్ ఆ సరుకులను డెలివరీ చేయడానికి ఆమె నివాసానికి వెళ్లాడు. అయితే ఆ మహిళ ఒంటరిగా ఉన్నట్లు గ్రహించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి ఆచూకీ గుర్తించి అతడు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అయితే సుమిత్ ఒక పోలీస్ నుంచి గన్ లాక్కొని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో సాయుధ ప్రతిస్పందన దళాలు, స్వాట్‌ను రప్పించి ఆ ప్రాంతంలో సెర్చ్ చేశారు.
మరోవైపు సాయుధ పోలీసులను చూసి నిందితుడు సుమిత్ సింగ్ వారిపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడి కాలుపై కాల్పులు జరిపారు. గాయపడిన అతడ్ని అరెస్ట్ చేశారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సుమిత్ సింగ్ గతంలో కూడా అక్రమ మద్యం కేసులో అరెస్టైనట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

