Delhi Pollution | ఢిల్లీలో స్వల్పంగా మెరుగుపడిన గాలి నాణ్యత.. పలు ఆంక్షలు సడలింపు..!
Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల గాలి నాణ్యత సూచీ మెరుగుపడింది. దీంతో బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. వాహన కాలుష్యాన్ని అరికట్టడంలో సహాయపడటానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద మూడో దశ ఆంక్షలు అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల గాలి నాణ్యత సూచీ మెరుగుపడింది. దీంతో బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. వాహన కాలుష్యాన్ని అరికట్టడంలో సహాయపడటానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద మూడో దశ ఆంక్షలు అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయా కార్ల వాహనదారులు ఆంక్షలు సడళించడంతో ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్తో సహా జాతీయ రాజధాని ప్రాంతంలోకి అనుమతి ఉండనున్నది. కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ కార్యచరణను నిర్ణయించేందుకు ఢిల్లీ సర్కారు సమావేశమై చర్చించింది.
కాలుష్యాన్ని నియంత్రించేందుకు తప్పనిసరిగా ఆంక్షలను అమలు చేయాలని ఆదేశించింది. వాహనాలకు సంబంధించి పీఎస్యూ సర్టిఫికెట్లను తనిఖీ చేయాలని పోలీసులకు సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన వాహన యజమానులకు రూ.20వేల వరకు జరిమానా విధించారు. ప్రభుత్వ డేటా ప్రకారం ఎన్సీఆర్ పరిధిలో 36శాతం వాహనాలు కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఎన్సీఆర్ ప్రాంతంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు, వ్యూహాన్ని రూపొందించే బాధ్యతను ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సమావేశమైంది. ఈ సందర్భంగా ఆంక్షలుపై పలు నిర్ణయాలు తీసుకున్నది. స్వల్పంగా గాలి నాణ్యత మెరుగుపడడంతో పలు ఆంక్షలు సడలించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

