Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17.3 డిగ్రీలకు చేరింది. చలి నేపథ్యంలో వాయు కాలుష్యం ఆందోళనకు గురి చేస్తున్నది. బుధవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ‘మోడరేట్’ కేటగిరీలో నమోదైంది. సోమవారం వాయు నాణ్యత భారీగా పడిపోయింది. పలు ప్రాంతాల్లో ప్రాంతాల్లో గాలులతో వర్షం కురవడంతో పరిస్థితి కాస్త మెరుగైంది. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) ప్రకారం.. బుధవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 130గా నమోదైంది. ఢిల్లీలో వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణశాఖ అంచనా వేసింది.