Jitendra Mani | ఎనిమిది నెలల్లో 46 కేజీల బరువు తగ్గిన ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి
ఢిల్లీలో సీనియర్ పోలీసు అధికారి ఒకరు భారీగా బరువు తగ్గి అందరినీ షాక్‌కు గురి చేస్తున్నారు. కఠినమైన ఆహార నియమాలతోపాటు క్రమం తప్పని నడకతో ఫిట్నెస్ సాధించి అందరి నుంచి ప్రశంసలు పొందుతున్నారు.
Jitendra Mani | ఢిల్లీలో సీనియర్ పోలీసు అధికారి ఒకరు భారీగా బరువు తగ్గి అందరినీ షాక్‌కు గురి చేస్తున్నారు. కఠినమైన ఆహార నియమాలతోపాటు క్రమం తప్పని నడకతో ఫిట్నెస్ సాధించి అందరి నుంచి ప్రశంసలు పొందుతున్నారు.
జితేంద్ర మణి ఢిల్లీలో డీసీపీగా పనిచేస్తున్నారు. ఆయన బరువు 130 కిలోలు. అతను మధుమేహం, అధిక రక్తపోటు, కొవ్వు స్థాయులు పెరగడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సమస్యల నుంచి బయటపడాలనుకున్నాడు. ఈ క్రమంలో బరువు తగ్గాలని నిర్ణయించుకుని.. తన జీవన విధానంలో కఠినమైన మార్పులు చేసుకున్నారు. రోజూ సుమారుగా 15వేల అడుగుల మేర నడిచేవారు. అంతేకాకుండా అధిక పోషకాలు కలిగిన ఆహారం, రోటీలు, రైస్, పండ్లు, సూప్స్, సలాడ్స్ వంటివి ఎక్కువగా తీసుకునేవారు. ఈ క్రమంలో అతను 8 నెలల్లోనే 46 కేజీల బరువు తగ్గారు.
ఈ సందర్భంగా జితేంద్ర మణి మాట్లాడుతూ.. ‘గతంలో నా బరువు 130 కిలోలు. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడ్డా. దీంతో సన్నగా మారాలని నిర్ణయించుకున్నా. అప్పుడు నేను నెలకు 4.5లక్షల అడుగులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఈ క్రమంలో 8 నెలల్లో మొత్తం 32 లక్షల అడుగుల మేర వాకింగ్ చేశా. ఇప్పుడు నేను 46 కిలోల బరువు తగ్గా. ప్రస్తుతం నా బరువు 84 కిలోలు. నా నడుము చుట్టుకొలత 12 అంగుళాలు తగ్గింది’ అని డీసీపీ జితేంద్ర మణి సంతోషంగా చెప్పుకున్నారు. కాగా, జితేంద్ర మణి కృషిని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ ఆరోడా ప్రశంసించారు. పోలీస్ శాఖ తరఫున ఆయనకు ఓ సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

