Rafale Fighter Jets: 26 రఫేల్ విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ గ్రీన్‌సిగ్నల్
Rafale Fighter Jets: 26 రఫేల్ విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ జరిగిన డీఏసీ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. రఫేల్స్‌తో పాటు స్కార్పీన్ సబ్మెరైన్లను కూడా కొనుగోలు చేసేందుకు డీఏసీ అనుమతి ఇచ్చింది. ఫ్రాన్స్ పర్యటనలో ప్రధాని మోదీ దీనిపై ప్రకటన చేయనున్నారు.
న్యూఢిల్లీ: కొత్తగా 26 రఫేల్ యుద్ధ విమానాల(Rafale Fighter Jets)ను కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. కొనుగోలు ప్రతిపాదనకు రక్షణశాఖ ఓకే చెప్పింది. 26 రఫేల్ విమానాలతో పాటు మూడు స్కార్పీన్ క్లాస్ జలాంతర్గామిల కొనుగోలుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆ కొనుగోలుకు క్లియరెన్స్ ఇచ్చింది. డీఏసీ మీటింగ్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ హాజరయ్యారు. త్రివిధ దళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్‌తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చీఫ్‌లు కూడా ఆ భేటీలో పాల్గొన్నారు. అయితే ఫ్రాన్స్ పర్యటన సమయంలో ప్రధాని మోదీ దీనిపై ప్రకటన చేయనున్నారు.
ఒప్పందం ప్రకారం.. భారతీయ నౌకాదళానికి 22 సింగిల్ సీట్ రఫేల్ విమానాలు రానున్నాయి. వీటితో పాటు నాలుగు శిక్షణ విమానాలు కూడా ఉంటాయి. భద్రతా సమస్యల నేపథ్యంలో యుద్ధ విమానాలు, జలాంతర్గాములు కావాలని ఇటీవల నేవీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐఎన్ఎస్ విక్రమాదిత్య, విక్రాంత్ .. మిగ్29 విమానాలను ఆపరేట్ చేస్తున్నాయి. ముంబైలోని మజగాన్ డాక్‌యార్డులో స్కార్పీన్ సబ్మెరైన్లను నిర్మించనున్నారు. దాదాపు 90 వేల ఖరీదైన ఒప్పందం జరిగే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

