Watch: ఆవును నోటితో గట్టిగా పట్టుకున్న సింహం.. రైతు ఏం చేశాడంటే!
Cow In The Grip Of Lioness | ఒక ఆవుపై ఆడ సింహం దాడి చేసింది. ఆవును చంపి తినేందుకు దాని మెడను నోటితో గట్టిగా పట్టుకుంది (Lioness Grips Cow). ఇది గమనించిన రైతు సింహం బారి నుంచి తన ఆవును కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సింహంపైకి రాళ్లు విసిరాడు.
అహ్మదాబాద్: ఒక ఆవుపై ఆడ సింహం దాడి చేసింది. ఆవును చంపి తినేందుకు దాని మెడను నోటితో గట్టిగా పట్టుకుంది (Lioness Grips Cow). ఇది గమనించిన రైతు సింహం బారి నుంచి తన ఆవును కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సింహంపైకి రాళ్లు విసిరాడు. దీంతో సింహం ఆ ఆవును విడిచి అడవిలోకి పారిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక రైతుకు చెందిన ఆవుపై ఆడ సింహం దాడి చేసింది. ఆవు మెడను నోటితో గట్టిగా పట్టుకుంది. దానిని రోడ్డు మీదకు ఈడ్చుకెళ్లింది. అయితే సింహం బారి నుంచి తప్పించుకునేందుకు ఆవు తెగ పెనుగులాడింది.
కాగా, కొంత దూరంలో ఉన్న రైతు తన ఆవును కాపాడుకునేందుకు ధైర్యంగా ముందుకు వచ్చాడు. గట్టిగా అరిచి సింహాన్ని బెదరగొట్టేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆవు మెడను సింహం వదలిపెట్టలేదు. దీంతో రోడ్డు పక్కన ఉన్న రాళ్లను సింహంపైకి విసిరాడు. చివరకు బెదిరిన ఆడ సింహం తన పట్టును సడలించింది. ఆ తర్వాత అడవిలోకి పారిపోయింది.
మరోవైపు ఆ సమయంలో అక్కడి రోడ్డుపై నిలిచిన ఒక కారులోని వ్యక్తి తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డ్ చేశాడు. జునాగఢ్లోని కేషోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా ఈ వీడియో క్లిప్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામે સિંહણ દ્વારા ગાય ઉપર હુમલો કરેલ ત્યારે ખેડૂતે #Credit કિરીટસિંહ ચૌહાણ પોતાની ગાયને એક ખમીરવંતો પ્રયાસ કરેલ અને સફળતા મળેલ.
ખુબ ખુબ સલામ#lion #animalattack #cow #lioness #kingofthejungle #hunt #wildlife #india #nationalgeographic #discovery pic.twitter.com/lDYGub9bfZ— Vivek Kotadiya Bjp (@VivekKotdiya) June 29, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

