అంత్యక్రియలకు 10 వేల మంది.. కరోనా అంటుకోదా మరి..
కరోనా | ఓ ముస్లిం మతాధికారి చనిపోవడంతో ఆయన అంత్యక్రియలకు దాదాపు 10 వేల మందికి పైగా హాజరయ్యారు. వీరంతా కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. కనీసం

లక్నో : ఓ ముస్లిం మతాధికారి చనిపోవడంతో ఆయన అంత్యక్రియలకు దాదాపు 10 వేల మందికి పైగా హాజరయ్యారు. వీరంతా కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. కనీసం మాస్కు కూడా ధరించలేదు.
ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాకు చెందిన ముస్లిం మతాధికారి అబ్దుల్ హామీద్ మహమ్మద్ సాలిమూల్ ఖాద్రీ ఆదివారం చనిపోయాడు. ఈ వార్త నిమిషాల్లోనే ఇతర రాష్ర్టాలకు చేరింది. దీంతో ఆ మతాధికారి అభిమానులు, ప్రజలు భారీ స్థాయిలో బదౌన్ జిల్లాకు చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇసుకెస్తే రాలనంతా జనం వచ్చారు. వీరంతా కరోనా నిబంధనలు ఉల్లంఘించారు.
అయితే అంత్యక్రియలకు కేవలం 20 మందిని అనుమతిస్తే ఇటీవలే యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ మతాధికారి అంత్యక్రియలకు పది వేల మందికి పైగా హాజరవడంతో.. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మాస్కు ధరించకపోతే తొలిసారి రూ. వెయ్యి, మాస్కు ధరించకుండా రెండోసారి పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా విధించాలని యూపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. యూపీలో గత కొద్ది రోజుల నుంచి రోజుకు 20 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

