ఓయో రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు.. జంటల కదలికల చిత్రీకరణ.. నలుగురు నిందితులు అరెస్ట్
OYO Rooms | ఓయో రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. అక్కడికి వచ్చే జంటల కదలికలను రహస్యంగా చిత్రీకరిస్తున్న ఒక ముఠా
న్యూఢిల్లీ: ఓయో రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. అక్కడికి వచ్చే జంటల కదలికలను రహస్యంగా చిత్రీకరిస్తున్న ఒక ముఠా ఆట కట్టించారు నోయిడా పోలీసులు. ఓబాధిత జంట ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను గుర్తించి ఆకస్మిక రైడ్ చేయడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అయితే ఈసీక్రెట్ కెమెరాల బాగోతంలో ఓయో స్టాఫ్ పాత్ర ఏమిలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
విష్ణుసింగ్, అబ్దుల్ వాహవ్, పంకజ్ కుమార్, అనురాగ్ కుమార్ సింగ్ అనే నలుగురు నిందితులు నోయిడాలోని మూడు వేర్వేరు గ్యాంగులతో కలిసి పనిచేస్తూ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. సాధారణంగా వీళ్లు అవసరమైన వారికి ఓయో హోటల్స్‌లో రూమ్స్ బుక్‌చేసి కమిషన్ తీసుకుంటారని, ఈ క్రమంలోనేరూమ్స్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారని చెప్పారు.
ఓయో గదుల్లో జంటల కదలికలన్నీ ఆ కెమెరాల్లో రికార్డవుతాయని, తర్వాత నిందితులు ఆ వీడియోలను సంబంధిత జంటలకు పంపి డబ్బు డిమాండ్ చేస్తారని, డబ్బులుఇవ్వకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతామని బ్లాక్ మెయిల్ చేస్తారని పోలీసులు వెల్లడించారు. పట్టుబడ్డ నలుగురు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో 11 లాప్‌టాప్‌లు, 21 మొబైల్ ఫోన్లు, 22 ఏటీఎం కార్డులు ఉన్నట్లు తెలిపారు. ఈ గ్యాంగుకు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

