కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు.. ఎయిమ్స్ చీఫ్ గులేరియా చెప్పింది ఇదీ!

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగియనే లేదు.. అప్పుడే థర్డ్ వేవ్‌పై ఆందోళన మొదలైంది. థర్డ్ వేవ్ తప్పదు అన్నది చాలా మంది వాదన. అయితే అది ఎప్పుడు వస్తుందన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పెద్దగా సమయం పట్టకపోవచ్చని ఒకరు, కనీసం ఆరు నుంచి 8 నెలలు పడుతుందని మరొకరు చెబుతున్నారు. అయితే తాజాగా ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా ఈ థర్డ్ వేవ్‌పై స్పందించారు. ఒకవేళ ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే వచ్చే 6 నుంచి 8 వారాల్లోనే థర్డ్ వేవ్ రావచ్చని ఆయన హెచ్చరించారు.
డెల్టా ప్లస్ వల్లే కరోనా థర్డ్ వేవ్ వస్తుందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ఆ వేరియంట్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతానికి ఇండియాలో ఆ వేరియంట్ ప్రభావం ఎక్కువగా లేదు. డెల్టా ప్రభావమే మన దగ్గర ఎక్కువ. అందువల్ల దానిని ట్రాక్ చేయడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి అని గులేరియా అన్నారు. ఈ వేరియంట్ ఎలా ప్రవర్తిస్తోందో ఎప్పటికప్పుడు చూస్తూ అందుకు తగిన విధంగా సిద్ధం కావాల్సి ఉంటుందన్నారు.
అయితే ఈ మూడో వేవ్ కోసం సిద్ధమవడంలో భాగంగా దేశంలో ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. మూడో వేవ్, డెల్టా ప్లస్ వేరియంట్లాంటి ముప్పు పొంచి ఉన్న ఈ సమయంలో మనం ఏం చేయగలమో చూడాలి. మన ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారించాలి అని గులేరియా అన్నారు. కాలానికి అనుగుణంగా ప్రజారోగ్య వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్యం అందరికీ సమానంగా అందే ప్రాథమిక లక్ష్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

