Ayodhya Ram Temple | 22న అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ.. సోనియా, ఖర్గే సహా విపక్ష నేతలకు ఆహ్వానం
రామ జన్మభూమి అయోధ్యలో రామాలయ (Ayodhya Ram Temple) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న రామయ్యకు ప్రాణప్రతిష్ఠ (Praan Pratistha) చేయనున్నారు.
అయోధ్య: రామ జన్మభూమి అయోధ్యలో రామాలయ (Ayodhya Ram Temple) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న రామయ్యకు ప్రాణప్రతిష్ఠ (Praan Pratistha) చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ (PM Modi)ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాజకీయ నాయకులతోపాటు వివిధ రంగాల ప్రముఖులకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ఆహ్వానం అందిస్తున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదురిని ఆహ్వానించినట్లు వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ చెప్పారు. వీరితోపాటు మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడను ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానం పలికామన్నారు. అదేవిధంగా త్వరలో మిగిలిన విపక్ష నేతలకు కూడా ఆహ్వానాలు అందుతాయని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
జనవరి 16 నుంచి 22 వరకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సం వేడుకలు జరుగనున్నారు. జనవరి 22న రాములవారికి గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అదేవిధంగా రాముని జీవిత విశేషాలను తెలియజేసేలా రూపుదిద్దిన 100 విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. జనవరి 15 వరకు అన్ని పనులను పూర్తిచేయాలని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు లక్ష్యంగా పెట్టుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

