14 ఓట్ల తేడాతో ఓటమి… గుండెపోటుతో కాంగ్రెస్ అభ్యర్థి మృతి
భోపాల్: కాంగ్రెస్ అభ్యర్థి 14 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఓటమిని తట్టుకోలేని ఆయన గుండెపోటుతో మరణించాడు. మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఈ సంఘటన జరిగింది. హనుమాన మండల కాంగ్రెస్ అధ్యక్షుడైన హరినారాయణ్ గుప్తా, మునిసిపల్ కౌన్సిల్ వార్డు నెం.9లో పార్టీ టికెట్‌పై పోటీ చేశాడు. ఆదివారం ఫలితాలు వెలువడగా స్వతంత్ర అభ్యర్థి అఖిలేష్ గుప్తా 14 ఓట్ల తేడాతో ఆయనపై విజయం సాధించాడు. దీంతో తన ఓటమి వార్తను విన్న హరినారాయణ్ గుప్తా వెంటనే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
కాగా, మధ్యప్రదేశ్‌లోని 413 మున్సిపాలిటీలు, 16 కార్పొరేషన్లు, 99 నగర పాలిక పరిషత్‌లు, 298 నగర్ పరిషత్‌లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. జూలై 6, 13 తేదీల్లో రెండు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం ఫలితాలు వెల్లడించారు. ఈ ఫలితాల ప్రకారం బుర్హాన్పూర్, సత్నా, ఖాండ్వా, సాగర్‌లలో బీజేపీ విజయం సాధించింది. అయితే సింగ్రౌలీలో సత్తా చాటి గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో తన ఖాతా తెరిచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

