మిగతా దశలకు ఒకేసారి పోలింగ్

- ఈసీకి మమత డిమాండ్
- ఆ ఆలోచన లేదన్న ఈసీ
కోల్కతా, ఏప్రిల్ 15: కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న దృష్ట్యా పశ్చిమ బెంగాల్లో మిగతా దశల పోలింగ్ను ఒకేసారి నిర్వహించాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ను ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించాలన్న ఈసీ నిర్ణయాన్ని మొదట్లోనే వ్యతిరేకించామని గురువారం ట్విట్టర్లో గుర్తుచేశారు. మలి దశ పోలింగ్ శనివారం జరగనున్నది. దీనికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. చివరి మూడు దశలు ఈ నెల 22, 26, 29 తేదీల్లో జరుగనున్నాయి. వీటిని కలిపి ఒకేసారి నిర్వహిస్తారన్న గురువారం ఊహాగానాలు మొదలయ్యాయి. అలాంటి ఆలోచనేమీ లేదని ఈసీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

