ఆయనో ఎమ్మెల్యే. ఓ వివాహంలో యువతిని చూడగానే మైమరిచిపోయారు. ఫ్లైయింగ్ కిస్ ఇచ్చేశారు. డబ్బులు వెదజల్లడం కూడా చేసేశాడు. అంతే కాకుండా ఓ యువతితో డ్యాన్స్ కూడా చేసేశారు. ఆ యువతిని చూడగానే.. ఇవన్నీ చేసేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గోపాల్ మండల్…. జేడీయూ ఎమ్మెల్యే. భాగల్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక.. ఈ వీడియో తెగ వైరల్ అవడంతో పార్టీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. బాధ్యతాయుత పదవిలో ఉన్నప్పుడు, హుందాగా వ్యవహరించాలంటూ అక్షింతలు వేశారు. అంత బహిరంగంగా ఆ డ్యాన్సులేమిటి? అంటూ సీఎం నితీశ్ ఫైర్ అయ్యారు. సార్… నేను పాటలు వినగానే కంట్రోల్ చేసుకోలేకపోయాను అని ఎమ్మెల్యే గోపాల్ సమాధానమిచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.