రైతుల తలలు పగులగొట్టండన్న అధికారిని సమర్థిస్తూ మాట్లాడిన హర్యానా సీఎం
హర్యానాలో ఆందోళన చేస్తున్న రైతుల తలలు పగులగొట్టండని పోలీసులకు ఆదేశించిన ఐఏఎస్ అధికారిని సమర్థిస్తున్నట్లుగా మాట్లాడారు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్.

చండీగఢ్: హర్యానాలో ఆందోళన చేస్తున్న రైతుల తలలు పగులగొట్టండని పోలీసులకు ఆదేశించిన ఐఏఎస్ అధికారిని సమర్థిస్తున్నట్లుగా మాట్లాడారు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్. ఆ అధికారి ఎంచుకున్న పదాలు సరికావేమో కానీ.. అక్కడ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉన్నదని ఖట్టర్ అన్నారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచడానికి అక్కడ కఠినంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అయినా ఆ అధికారి ఎంచుకున్న పదాలు మాత్రం సరికాదు. ఆ అధికారిపై ఏదైనా చర్య తీసుకోవాలంటే ముందుగా దానిపై జిల్లా యంత్రాంగం అంచనా వేయాలి. డీజీపీ కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు అని ఖట్టర్ చెప్పారు.
శనివారం కర్నాల్‌లో ముఖ్యమంత్రి పాల్గొన్న బీజేపీ సమావేశానికి రైతులు రాకుండా అడ్డుకోవడానికి పోలీసులు వాళ్లపై లాఠీచార్జ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పది మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. కొందరి తలలు పగిలాయి. అయితే అక్కడే ఉన్న ఐఏఎస్ అధికారి రైతులను అడ్డుకోవడానికి తలలు పగులగొట్టండని చెప్పిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. సదరు అధికారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాలా చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

