స్పెషల్ టాస్క్ బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోద తీర్మానంపై ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్‌రావు చేసిన ప్రసంగానికి జాతీయ మీడియా అధిక ప్రాధాన్యం కల్పించింది. స్వాతంత్య్ర పోరాటం మొదలుకొని ప్రస్తుత అదానీ షేర్ల పతనం వరకు, నెహ్రూ మొదలుకొని మోదీ దాకా, నీతి అయోగ్ మొదలుకొని నీటిపారుదల రంగం దాకా, రేషన్ డీలర్ మొదలుకొని రైళ్ల వేగం దాకా, సింగపూర్ మొదలుకొని జీఎస్డీపీ దాకా ప్రతి అంశాన్ని స్పృశిస్తూ సాగిన సీఎం కేసీఆర్ ప్రసంగం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.
ఆంగ్ల, హిందీ జాతీయ మీడియా మొదలుకొని ప్రాంతీయ భాషల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు దేశవ్యాప్తంగా కేసీఆర్ ప్రసంగాన్ని హైలెట్ చేశాయి. ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యాలను, కాంగ్రెస్ హయాంలో దేశం అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడలేక చతికిలపడ్డ వైనాన్ని ఉదాహరణలతో సహా విడమర్చి చెప్తూ సాగిన కేసీఆర్ ప్రసంగాన్ని జాతీయ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది.
ఇంగ్లిష్ న్యూస్ వెబ్సైట్లలో..
ఎన్డీటీవీ: పీఎం 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఏ జోక్, వుయ్ షుడ్ డేర్ టు డ్రీమ్ బిగ్, సేస్ కేసీఆర్
ది హిందూ: బీజేపీ విల్ నాట్ రిటర్న్ టు పవర్ ఆఫ్టర్ 2024: కేసీఆర్
టైమ్స్ ఆఫ్ ఇండియా: నరేంద్రమోదీ మోస్ట్ ఇనెఫెక్టివ్ పీఎం ఆఫ్ ఇండియా, ఓన్లీ బోస్ట్స్: తెలంగాణ సీఎం కేసీఆర్
డక్కన్ క్రానికల్: కేసీఆర్ టేక్స్ ఆన్ మోదీ ఒవర్ అదానీ కాంట్రవర్సీ
డక్కన్ హెరాల్డ్: పీఎం మోదీ 5 ట్రిలియన్ డా లర్ ఎకానమీ టార్గెట్ ఏ జోక్, సేస్ కేసీఆర్
ది స్టేట్స్‌మన్: కేసీఆర్ ఎటాక్స్ పీఎం మో దీ ఒవర్ హిజ్ సైలెన్స్ ఆన్ అదానీ గ్రూప్
సియాసత్ డైలీ: అదానీ, బీబీసీ డాక్యుమెంట్, 5 ట్రిలియన్ డాలర్: కేసీఆర్ ఫైర్స్ ఎట్ మోదీ లెడ్ సెంటర్
హిందుస్థాన్ టైమ్స్: మన్మోహన్ డిడ్ బెటర్ జాబ్ దాన్ మోదీ, సేస్ కేసీఆర్
ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైండ్స్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ బెటర్ దాన్ మోదీ గవర్నమెంట్
ది హన్స్ ఇండియా: ఎన్డీయే బిగ్ జోక్: కేసీఆర్
ఇంగ్లిష్ వార్తాపత్రికల్లో..
డక్కన్ క్రానికల్: కేసీఆర్ క్రిటిసైజెస్ మోదీ, రేక్స్ అప్ అదానీ రో
ది హన్స్ ఇండియా: ఎన్డీయే బిగ్ జోక్: కేసీఆర్
ది పయనీర్: ఇట్ ఈజ్ సైలెన్స్ రాజ్ ఎట్ సెంటర్
ది హిందూ: బీజేపీ విల్ నాట్ రిటర్న్ టు పవర్ ఆఫ్టర్ 2024: కేసీఆర్
ఇండియన్ ఎక్స్‌ప్రెస్: కేసీఆర్ ఫైండ్స్ మన్మోహన్సింగ్ గవర్నమెంట్ బెటర్ దాన్ మోదీ
గవర్నమెంట్
హిందీ పత్రికల్లో..
హిందుస్థాన్ : కేసీఆర్ నే పీఎం మోదీ కీ ఇందిరాగాంధీ సే కీ తుల్నా.. కహా-2024 మే భాజపా శాసన్ ఖత్మ్
అమర్ ఉజాలా : కేసీఆర్ బోలే – పీఎం మోదీ కా పాంచ్ లాఖ్ కరోడ్ డాలర్ కీ అర్థ్ వ్యవస్థా కా లక్ష్య్ ఏక్ మజాక్, భాజ్పా నే కియా పలట్ వార్
దేశ్ బంధు : కేసీఆర్ నే బీబీసీ డాక్యుమెంటరీ పర్ ప్రతిబంధ్ కో లేకర్ మోదీ సర్కార్ కీ ఆలోచనా కీ
హిందీమిలాప్ డైలీ : భాజ్పా కో ఓట్ క్యోం.