పంజాబ్ కొత్త సీఎం చన్నీ

- ఏకగ్రీవంగా ఎన్నుకొన్న సీఎల్పీ
- పంజాబ్‌కు తొలి దళిత ముఖ్యమంత్రి
- నేడు ఉదయం ప్రమాణ స్వీకారం
- మరో 4 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు
చండీగఢ్, సెప్టెంబర్ 19: ఆదివారం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జీత్ సింగ్ చన్నీని(49) ఎంపిక చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ‘పంజాబ్ కొత్త సీఎంగా రాష్ట్ర సీఎల్పీ చరన్జీత్ సింగ్ చన్నీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నది. రాష్ట్రం నుంచి సీఎం పదవిని చేపట్టనున్న తొలి దళితుడు ఆయనే. ఈ విషయాన్ని వెల్లడించడం చాలా సంతోషంగా ఉంది’ అని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ హరీశ్ రావత్ సాయంత్రం ట్వీట్ చేశారు. అనంతరం చన్నీ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌ను కలిశారు. సోమవారం ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. పంజాబ్‌లో మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. తమను గెలిపిస్తే దళిత వ్యక్తిని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది. బీఎస్పీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్న శిరోమణి అకాలీదళ్ కూడా ఇదే తరహా హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే దళితులను డిప్యూటీ సీఎం చేస్తామని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా దళిత వ్యక్తిని ఎన్నికల ముందు సీఎంగా ఎంపిక చేసింది. పంజాబ్‌లో దళితుల జనాభా 32% ఉంటుందని అంచనా. చన్నీ మాల్వా బెల్డ్‌లో రూప్‌నగర్ జిల్లాలోని చామ్‌కౌర్ సాహిబ్ అసెంబ్లీ స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చన్నీ.. అమరీందర్ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.
జఖార్.. అంబికా.. సుఖ్జిందర్.. చివరకు చన్నీ..
పంజాబ్ కొత్త సీఎం ఎంపిక చేసే సమయంలో హైడ్రామా చోటు చేసుకొన్నది. ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఉదయం 11 గంటలకు జరుగాల్సిన సీఎల్పీ భేటీ వాయిదా పడింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు హరీశ్ రావత్, అజయ్ మాకెన్, హరీశ్ చౌదరి చండీగఢ్‌లో ఓ హోటల్లో ఉండి ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో తొలుత సునీల్ జఖార్ పేరు వినిపించింది. తర్వాత సీనియర్ నేత అంబికా సోనిని ఎంపిక చేస్తే ఆమె తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. తర్వాత, సుఖ్జిందర్ సింగ్ రంధావా పేరు బయటకు వచ్చింది. చివరికి చన్నీని సీఎంగా ఎన్నుకొన్నట్టు హరీశ్ రావత్ ట్వీట్ చేయడంతో హై డ్రామాకు తెరపడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

