Raghav Chadha | రాఘవ్ చద్దాకు జడ్+ సెక్యూరిటీ తొలగించిన ఆప్ ప్రభుత్వం.. జడ్ సెక్యూరిటీ ఇచ్చిన కేంద్రం
Raghav Chadha : కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Raghav Chadha : కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాఘవ్ చద్దాకు కల్పించిన జడ్+సెక్యూరిటీని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ సెక్యూరిటీని రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన గంటల వ్యవధిలోనే కేంద్రం ఆయనకు జడ్ కేటగిరి సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. దీనిపై కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సెక్యూరిటీ ఆయనకు పంజాబ్‌తోపాటు ఢిల్లీలో కూడా వర్తిస్తుంది. జడ్ సెక్యూరిటీలో పారామిలిటరీ సైనికులు కూడా ఉంటారు. ప్రస్తుతానికి చద్దాకు ఢిల్లీ పోలీసులు గట్టి భద్రత కల్పిస్తున్నారు. కేంద్రం పూర్తి భద్రత కల్పించేవరకు ఢిల్లీ పోలీసులదే బాధ్యత. ఇంటెలిజెన్స్ బ్యూరో అందించిన సమాచారం ఆధారంగా కేంద్రం ఈ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చద్దాకు భద్రత తొలగించడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి, చద్దాకు మరింత దూరం పెరిగిందని స్పష్టమవుతోంది. రాజ్యసభలో చద్దా ఆప్ తరఫున ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయనకు ఇంత వరకు పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వమే జడ్+ సెక్యూరిటీ కల్పిస్తూ వచ్చింది. రాజ్యసభలోనూ చద్దాకు ఆప్ మంచి స్థానం ఇచ్చింది. రాజ్యసభలో ఆప్ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమించింది. ఇటీవల ఉన్నట్లుండి చద్దాను ఆ పదవి నుంచి తొలగించింది.
దీనిపై చద్దా స్పందిస్తూ.. తనను మాట్లాడకుండా చేయగలరేమో కానీ, తనను ఓడించలేరని వ్యాఖ్యానించారు. అనంతరం ఆప్, రాఘవ్ చద్దా మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో పార్టీకి, చద్దాకు మధ్య దూరం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో చద్దా త్వరలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చద్దా నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ ఎలాంటి స్పందనా రాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

