ఎన్యుమరేటర్లుగా ప్రైవేట్ టీచర్లు
జన గణన సిబ్బందిగా నియమితులయ్యే వారి పరిధిని కేంద్రం విస్తరించింది. శుక్రవారం జారీచేసిన సవరించిన నిబంధనల ప్రకారం, ఇకపై ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు క్లరికల్ సిబ్బంది కూడా ఈ గణన విధులను చేపట్టవచ్చు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : జన గణన సిబ్బందిగా నియమితులయ్యే వారి పరిధిని కేంద్రం విస్తరించింది. శుక్రవారం జారీచేసిన సవరించిన నిబంధనల ప్రకారం, ఇకపై ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు క్లరికల్ సిబ్బంది కూడా ఈ గణన విధులను చేపట్టవచ్చు. 1948 నాటి సెన్సస్ చట్టం సెక్షన్ 18(1) కింద కేంద్రం ఈ సవరణ నిబంధనలను నోటిఫై చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం ప్రభుత్వం ద్వారా నడిపే విద్యాసంస్థలు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సొసైటీలు, ట్రస్ట్ల్లో పనిచేసే సిబ్బందిని ఎన్యుమరేటర్లుగా నియమిస్తారు.
భర్తను హతమార్చిన భార్య, ప్రియుడికి మరణ శిక్ష
మీరట్, అక్టోబర్ 16: వివాహేతర సంబంధం మోజులో భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిన మరో జంటకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. భర్తను ప్రియుడితో కలిసి గొంతునులిమి చంపడమే కాక, పాముకాటుతో అతడు మరణించాడంటూ నమ్మించడానికి ప్రయత్నించిన భార్య రవిత, ఆమె లవర్ అమర్దీప్కు యూపీలోని మీరట్ అదనపు జిల్లా జడ్జి శుక్రవారం మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసు అత్యంత అరుదైనదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. హిందూ సంప్రదాయంలో భార్యను భర్తకు ‘అర్థాంగిని’గా అంటే సమానమైన పరిపూరకమైన సగంగా భావిస్తారని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

