Ban on PAK OTT | భారతదేశ చరిత్రను వక్రీకరించేలా వెబ్‌సిరీస్.. పాకిస్థాన్ ఓటీటీపై నిషేధం
భారత దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమధికారాన్ని దెబ్బతీసేలా వెబ్‌సిరీస్
Ban on PAK OTT : పాకిస్థాన్‌కు చెందిన ఒక ఓటీటీ టీవీ ఛానెల్‌పై భారత్ నిషేధం విధించింది. భారతదేశానికి వ్యతిరేకంగా వెబ్‌సిరీస్‌ను రూపొందించారనే కారణంతో విడ్లి (Vidly TV) ఓటీటీని సోమవారం బ్యాన్ చేసింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ వెబ్‌సైట్‌కు సంబంధించిన రెండు మొబైల్ యాప్స్, నాలుగు సోషల్‌మీడియా ఖాతాలను ఐటీ చట్టం 2021 ప్రకారం నిషేధించింది. విడ్లి సంస్థ తాజాగా “Sevak: The Confessions (సేవక్ ది కన్ఫెషన్ )అనే వెబ్ సిరీస్ రూపొందించింది. ఈ వెబ్ సిరీస్ భారత దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమధికారానికి, విదేశాలతో భారత స్నేహ సంబంధాలకు హాని చేసే విధంగా ఉందని ఆ ప్రకటనలో పేర్కొంది.
సేవక్ వెబ్‌సిరీస్ ప్రారంభంలోనే భారత జాతీయ జెండాలోని అశోక చక్రం మంటల్లో తగలబడుతున్న సీన్ వస్తుంది. అంతేకాదు భారతదేశానికి సంబంధించిన సున్నితమైన అంశాలను ఇందులో వక్రీకరించి చూపించారు. ఈ వెబ్‌సిరీస్‌లో భారతదేశాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు. చరిత్రను తప్పుదోవ పట్టించేలా తెరకెక్కించారు. భారతప్రభుత్వం స్వర్ణ దేవాలయంలో చేపట్టిన ఆపరేషన్ బ్లూస్లార్, ఆ తర్వాతి సంఘటనలు, బాబ్రీ మసీద్ కూల్చివేత, మాలేగావ్ పేలుళ్లతో పాటు సట్లెజ్, యమునా నది మధ్య వివాదం గురంచి కూడా వెబ్‌సిరీస్‌లో తప్పుగా చూపించారని కేంద్ర సమాచార శాఖ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

