నరేంద్ర గిరి మృతిపై దర్యాప్తునకు ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం

ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంతి నరేంద్ర గిరి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ ఆరుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న బాఘంబరి మఠంలో నరేంద్ర గిరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే సూసైడ్ నోట్‌పై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆయన మరణం ఓ మిస్టరీగా మారింది. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. మహంతి నరేంద్ర గిరి మృతిపై దర్యాప్తు చేపట్టేందుకు ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం ప్రయాగ్‌రాజ్ చేరుకోనున్నది.
మరోవైపు ఈ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనంద గిరి, ఆద్యా ప్రసాద్ తివారీలను స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆ ఇద్దర్నీ 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలోకి పంపారు. నరేంద్ర గిరి మృతిపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో భాఘంబరి ఘడి మఠం వారసుడి నియామకం విషయంలో జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. నరేంద్ర గిరి కేసులో దర్యాప్తు ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ నరేంద్ర గిరి వద్ద లభ్యమైన సూసైడ్ నోట నకిలీదని తెలిస్తే, అప్పుడు మఠం సభ్యులు సంయుక్తంగా వారసున్ని ఎన్నుకుంటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

