NEET-UG: నీట్ యూజీ పేపర్ లీక్ కేసు.. గుజరాత్‌లోని ఏడు చోట్ల సీబీఐ సోదాలు
NEET-UG paper leak case: నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో ఇవాళ సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. గుజరాత్‌లోని ఏడు ప్రదేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. అనుమానితుల ఇండ్ల వద్ద ఇవాళ ఉదయం నుంచి తనిఖీ జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
న్యూఢిల్లీ: నీట్ యూజీ(NEET-UG) పేపర్ లీకేజీ కేసులో ఇవాళ సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. గుజరాత్‌లోని ఏడు ప్రదేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. అనుమానితుల ఇండ్ల వద్ద ఇవాళ ఉదయం నుంచి తనిఖీ జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆనంద్, ఖేడా, అహ్మాదాబాద్, గోద్రా జిల్లాల్లో ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో మరో హిందీ పత్రిక జర్నలిస్టును కూడా అరెస్టు చేశారు.
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో మొత్తం ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. కేంద్ర విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాగా, దర్యాప్తు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో మిగితా కేసులు నమోదు అయ్యాయి. బీహార్, గుజరాత్ల నుంచి ఒక కేసు దర్యాప్తు జరగ్గా, రాజస్థాన్‌లో మూడు కేసుల్లో దర్యాప్తు జరుగుతోంది.
ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ అడ్మిషన్ల కోసం నీట్ యూజీ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఈ ఏడాది మే 5వ తేదీన 4750 కేంద్రాల్లో ఆ పరీక్షలను నిర్వహించారు. సుమారు 23 లక్షల మంది ఆ పరీక్షలు రాశారు. జూన్ 23వ తేదీన సీబీఐ తన తొలి ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cbi
- Gujarat
- NEET UG
- paper leak case
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

