ఆర్మీ వ్యక్తి హనీట్రాప్… ఐఎస్ఐ మహిళా ఏజెంట్‌కు కీలక సమాచారం లీక్
జైపూర్: హనీట్రాప్‌లో చిక్కుకున్న ఆర్మీ వ్యక్తి, పాకిస్థాన్ ఐఎస్ఐ మహిళా ఏజెంట్‌కు కీలక సమాచారం లీక్ చేశాడు. దీంతో శనివారం అతడ్ని అరెస్ట్ చేశారు. ఆర్మీకి చెందిన 22 ఏళ్ల ప్రదీప్ కుమార్, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆరు నెలల కిందట పాకిస్థాన్‌కు చెందిన ఒక మహిళతో ఫేస్బుక్లో అతడికి పరిచయం ఏర్పడింది. వారిద్దరూ నాటి నుంచి వాట్సాప్‌లో చాట్ చేస్తున్నారు. తాను హిందూ మహిళగా ఆమె నమ్మించింది. తన పేరు ఛదం అని, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నివాసం ఉంటున్నట్లు పేర్కొంది. బెంగళూరులోని ఒక కార్పొరేట్ సంస్థలో పని చేస్తున్నట్లు ఆమె చెప్పింది.
కాగా, హనీట్రాప్‌లో చిక్కుకున్న ప్రదీప్ కుమార్ ఇటీవల ఢిల్లీ వెళ్లాడు. పెళ్లి పేరుతో ఆర్మీకి సంబంధించిన సమాచారం సంపాదించాడు. ఆ కీలక సమాచారం, చిత్రాలను పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఎస్)కు చెందిన ఆ మహిళకు వాట్సాప్ ద్వారా పంపాడు.
ఈ విషయాన్ని పసిగట్టిన రాజస్థాన్ పోలీసులు ఈ నెల 18న ప్రదీప్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని దీనిపై ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అతడ్ని అరెస్ట్ చేసినట్లు శనివారం ప్రకటించారు. ప్రదీప్ స్నేహితురాలికి కూడా ఈ నేరంతో సంబంధం ఉందని రాజస్థాన్ ఇంటెలిజెన్స్ డీజీ ఉమేశ్ మిశ్రా తెలిపారు. ప్రదీప్ మాటలు నమ్మి ఆమె బలి పశువు అయ్యిందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

