teen slits child’s throat | కాళికా వేషం వేసిన యువకుడు.. రాక్షసుడి వేషం వేసిన బాలుడి గొంతు కోసి హత్య
teen slits child’s throat | ఒక యువకుడు కాళికా దేవి వేషం వేశాడు. కత్తి చేతపట్టిన అతడు రాక్షసుడి పాత్ర పోషించిన బాలుడి గొంతు కోసి హత్య చేశాడు. ఇది చూసి అక్కడి వారు షాక్ అయ్యారు.
లక్నో: ఒక యువకుడు కాళికా దేవి వేషం వేశాడు. కత్తి చేతపట్టిన అతడు రాక్షసుడి పాత్ర పోషించిన బాలుడి గొంతు కోసి హత్య చేశాడు. ఇది చూసి అక్కడి వారు షాక్ అయ్యారు. (teen slits child’s throat) ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బంభియాన్పూర్ గ్రామంలోని సుభాష్ సైనీ ఇంట్లో బుధవారం భాగవత కథా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు పలు దేవతల వేషధారణలో నటించారు. అయితే కాళికా దేవి పాత్ర పోషించిన 14 ఏళ్ల బాలుడు ఉన్నట్టుండి చేతిలోని కత్తితో రాక్షసుడి వేషం వేసిన 11 ఏళ్ల బాలుడి గొంతు కోశాడు. ఆ బాలుడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడైన 14 ఏళ్ల బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ప్రశ్నించిన తర్వాత జువెనైల్ కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు వెల్లడించారు.
మరోవైపు రాక్షసుడి ప్రాతలో ఉన్న బాలుడ్ని బెదిరించేందుకు త్రిశూలం వినియోగించాలని కాళీ వేషం వేసిన బాలుడికి సూచించినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే త్రిశూలం లభించకపోవడంతో పదునైన కత్తిని అతడు తీసుకువచ్చినట్లు పోలీసులకు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Boy
- child
- demon role
- enacting
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

