Border Clashes: అసోం సీఎంపై కేసును పునఃపరిశీలిస్తాం: మిజోరం
Border clashes: అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మకు వ్యతిరేకంగా తమ రాష్ట్రంలో నమోదైన కేసును పునఃపరిశీలిస్తామని మిజోరం ప్రభుత్వం ప్రకటించింది.

ఐజ్వాల్: అసోం, మిజోరం సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణలకు ( Border Clashes ) సంబంధించి అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మకు వ్యతిరేకంగా తమ రాష్ట్రంలో నమోదైన కేసును పునఃపరిశీలిస్తామని మిజోరం ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మిజోరం రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ లాల్నున్మావియా చువాంగో ఒక ప్రకటన చేశారు. అసోం సీఎం హిమాంత బిశ్వశర్మకు వ్యతిరేకంగా మిజోరంలో ఎఫ్ఐఆర్ నమోదైన విషయం మిజోరం ముఖ్యమంత్రి జొరామ్తంగకు గానీ, తనకుగానీ తెలియదని లాల్నున్మావియా చెప్పారు. ఈ కేసు విషయాన్ని సీఎం జొరామ్‌తంగ దృష్టికి తీసుకెళ్లగా ఆయన పునఃపరిశీలిద్దామని చెప్పినట్లు తెలిపారు.
జూలై 26న అసోం, మిజోరం సరిహద్దుల్లో ఆ రెండు రాష్ట్రాల పోలీసుల బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో అసోంకు చెందిన ఆరుగురు పోలీసులు, ఒక పౌరుడు మృతిచెందారు. ఎస్పీ సహా మరో 50 మంది గాయపడ్డారు. మిజోరం వైపు కూడా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణలకు సంబంధించి జూలై 30న మిజోరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ, మరో నలుగురు సీనియర్ అధికారులను అందులో నిందితులుగా చేర్చారు. హత్యాయత్నం, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింది వారిపై కేసులు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

